తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ప్రభాస్ గురించి తరచూ వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ ఇంకా ఈయన పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ బాలకృష్ణ టాక్ షోలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.
ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయకపోయినప్పటికీ వీరిద్దరి మధ్య ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.ప్రభాస్ డైరెక్ట్ గా అనుష్కతో పెళ్లి ఎప్పుడు అని అడగడంతో ప్రభాస్ సిగ్గుపడుతూ మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఏమిలేదు సర్ ఏవో వార్తలు రాస్తుంటారు అంతే అని చెప్పారట. అదే విధంగా త్వరలోనే తన పెళ్లి గురించి కూడా ప్రకటిస్తానని ఈ విషయాన్ని అధికారకంగా అందరికీ తెలియజేస్తానని ప్రభాస్ చెప్పినట్టు తెలుస్తుంది.
ఈ విధంగా ప్రభాస్ తన పెళ్లి గురించి బాలయ్య టాక్ షోలో మాట్లాడటంతో బాలయ్య నీ పెళ్లి గురించి నా టాక్ షోలో ప్రస్తావించడం చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రభాస్ పెళ్లి గురించి ఈ కార్యక్రమంలో మాట్లాడినట్టు తెలుస్తోంది.మరి ప్రభాస్ పెళ్లి గురించి ఏ విధమైనటువంటి వార్త తెలియచేయనున్నారనే విషయంపై అభిమానుల సైతం ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో వీరి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలియనుంది.