నందమూరి బాలకృష్ణ సినిమాల తోనే కాకుండా ఈమధ్య హోస్ట్ గా షోలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 4 కొనసాగుతుంది. ప్రతి వారం ఒక్కొక్క సెలబ్రెటీని తీసుకొని వచ్చి ముచ్చట్లు చెప్తున్నారు బాలయ్య. అయితే సీజన్ 4 ఎపిసోడ్ 7 ప్రోమో విడుదల అయింది.
ఈసారి చీఫ్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ తో పాటు తన సోదరుడైన దగ్గుబాటి సురేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, కథానాయకులు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు కూడా వచ్చారు. సంక్రాంతికి విడుదల కానున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ షోలో పార్టిసిపేట్ చేశారు చిత్ర బృందం. అయితే ఈ ప్రోమోలో వెంకటేష్ తన కాలేజీ రోజుల గురించి మాట్లాడుతూ ఎన్నో అల్లరి పనులు చేసాం అని చెప్పారు.
తన సోదరుడు సురేష్ తో కలిసి తన నాన్నగారి గురించి తలచుకొని ఎమోషనల్ అయ్యారు వెంకటేష్. అలాగే తన కూతుర్ల ముగ్గురు గురించి బాలయ్యతో చెప్పుకొచ్చారు. వీళ్ళతో పాటు అనిల్ రావిపూడి, ఇద్దరు హీరోయిన్లు కూడా చాలా సందడిగా మాట్లాడారు. బాలయ్య కూడా భలే హుషారుగా మాట్లాడుతూ వెంకటేష్ తో తన బాండింగ్ గురించి చెప్పారు. ఇలా ఇద్దరి కామెడీలతో మాటలు జోరుగా సాగుతూ ప్రమో చాలా సందడిగా సాగింది.
అయితే ఈ ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 27 రాత్రి 7 గంటలకు ఆహా యాప్ లో ప్రసారం కానుంది. ఇదిలా ఉండగా ఈ సంక్రాంతికి బాలయ్య సినిమాతో పాటు వెంకటేష్ సినిమా కూడా రావడం విశేషం. ఇద్దరూ పోటాపోటీ మీద సంక్రాంతికి సినిమాలు విడుదల చేయనున్నారు. ఒకవైపు వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేయగా మరోవైపు బాలయ్య సీరియస్ లుక్ లో రఫ్ ఆడిస్తున్నారు. మరి ఇద్దరి సినిమాలో సంక్రాంతి విన్నర్ ఏమవుతుందో చూడాలి.