జబర్దస్త్‌లో సందడి చేసిన కుష్బూ.. వచ్చి రాగానే ఆ కమెడియన్ కి స్ట్రాంగ్ కౌంటర్?

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎన్నో సంవత్సరాలుగా ప్రసారమవుతూ.. నంబర్ 1 షో గా కొనసాగుతోంది. అయితే ఈ షో నుండి జడ్జ్స్ తో పాటు కొందరు ఫేమస్ కమెడియన్లు కూడా బయటకు వెళ్లిపోయారు. దీంతో ఈ షో రేటింగ్స్ పడిపోయాయి. అందువల్ల ఈ షో టిఆర్పి రేటింగ్స్ పెంచడానికి జబర్దస్త్ యాజమాన్యం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ షో కి మరొక కొత్త జడ్జ్ ని తీసుకువచ్చారు. మొదట నాగబాబు ఈ షో నుండి వెళ్ళిపోయాడు. తర్వాత మంత్రి పదవి రావటంతో రోజా కూడా ఈ షో నుండి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు వీరిద్దరి స్థానంలో ఇంద్రజ, మనో జడ్జీ లుగా ఉన్నారు.

మనో జబర్దస్త్ తో పాటు మరికొన్ని సింగింగ్ షోస్ లో చేయటం వల్ల అప్పుడప్పుడు జబర్దస్త్ లో కనిపించడం లేదు. ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో కూడా మనో స్థానంలో అలనాటి ప్రముఖ హీరోయిన్ కుష్బూ సందడి చేయనుంది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ ఎపిసోడ్ లో కుష్బూ ఎంట్రీ లోనే రష్మి తో కలిసి డాన్స్ ఇరగదీసింది. ఇక ఈ ఎపిసోడ్ లో బుల్లెట్ భాస్కర్ స్కిట్ చూసి మీరు బుల్లెట్ డైరెక్ట్ గా గుండెల్లో దింపారు అంటూ కామెంట్ చేసింది.

ఇక ఎప్పటిలాగే ఈ ఎపిసోడ్ లో ఆటో రామ్ ప్రసాద్ తన ఆటో పంచ్ లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో మీరు పెర్మనెంట్ గా జబర్దస్త్ లో ఉంటే మీకు మా గుండెల్లో గుడి కడతాం అంటూ చెప్పగా..ఇంకా కట్టలేదా అంటూ కుష్బూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ లో రాకింగ్ రాకేష్ స్కిట్ లో యాదమ్మ రాజు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో విలన్ పాత్రని చేస్తూ అమ్రీష్ దోష అంటూ వచ్చి దేవకన్య గెటప్ లో జోర్ధార్ సుజాతను చూస్తూ ఈ కన్య మాములు కన్య కాదు.. దగ్గరి నుంచి చూస్తే అసలు కన్యే కాదని దారుణంగా సుజాత పరువు తీశారు. ఇలా ఈ ఎపిసోడ్ కూడా ఎప్పటిలాగే ఫుల్ కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను అలరించనుంది.