మెగా ఫోన్ పట్టుకున్న జబర్దస్త్ కమెడీయన్ వేణు.. త్వరలోనే విడుదల కానున్న సినిమా?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశాలు వస్తాయో ఎవరికీ తెలియదు.ఇలా ఉన్నఫలంగా కొందరు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలోనే కమెడియన్ గా ప్రభాస్ నటించిన మున్నా సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ పాత్రలో నటించి అందరిని సందడి చేశారు కమెడియన్ వేణు.ఇలా వేణు పలు సినిమాలలో కమెడియన్ గా నటించి అనంతరం బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో వేణు వండర్స్ టీం లీడర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళిన అనంతరం పలు కార్యక్రమాలలో చేస్తూ వచ్చారు అలాగే ఈయన తెలంగాణ హత్యల నేపథ్యంలో ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారట అయితే ఈ కథను టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు వినిపించడంతో దిల్ రాజుకు ఈ సినిమా చాలా బాగా నచ్చి తన ప్రోత్సాహంతో ఈ సినిమాని నిర్మించారట. ఈ క్రమంలోనే వేణు డైరెక్షన్ లో ఈ సినిమా పూర్తి అయ్యిందని ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న అనంతరం ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టారు ఇందులో ఎవరెవరు నటిస్తున్నారనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను తెలియచేయనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వేణు దర్శకుడుగా మారారని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి దర్శకుడిగా ఈయన ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారో తెలియాల్సి ఉంది.