సుడిగాలి సుదీర్ క్రేజ్ వెనుక ఉన్నది ఆ ఫ్యామిలీనేనా.. తన అభిమానమే ప్లస్ అయ్యిందా?

సుడిగాలి సుదీర్ బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా బుల్లితెరపై యాంకర్ గా కమెడియన్ గా ఎంతో పేరు పొందినటువంటి సుధీర్ ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈయన హీరోగా తాజాగా విడుదలైన సినిమా గాలోడు. అయితే ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టి పెద్ద ఎత్తున లాభాలను తీసుకొస్తుంది.

ఈ విధంగా ఎక్కడో రామోజీ ఫిలిం సిటీలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి సుడిగాలి సుదీర్ ఇలా వెండితెరపై హీరోగా ఇలాంటి క్రేజ్ సొంతం చేసుకోవడానికి గల కారణం ఏంటి అని చాలామంది ఆరా తీస్తున్నారు. అయితే ఈయన తన టాలెంట్ నమ్ముకుని ఏ విధమైనటువంటి గర్వం చూపించకుండా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదగడమే ఈయన విజయానికి కారణమని తెలుస్తుంది అదేవిధంగా సుధీర్ మెగా ఫ్యామిలీకి పెద్ద అభిమాని.

ఇలా ఈయన ఎప్పటికప్పుడు మెగాస్టార్ చిరంజీవిని అనుసరించడం అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతర మెగా హీరోలపై ప్రశంసలు కురిపించడం కూడా ఈయనకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఇలా మెగాస్టార్ ఫ్యామిలీ పట్ల సుడిగాలి సుదీర్ చూపించే అభిమానమే తనకు నేడు ఇండస్ట్రీలో ఇలాంటి ఆదరణ తీసుకువచ్చిందని తెలుస్తుంది. ప్రస్తుతం సుధీర్ నటించిన గాలోడు సినిమా విషయంలో మెగా ఫాన్స్ ఆదరణ కూడా ఉందనీ తెలుస్తోంది.