నాకు విల్లా కొనిపెట్టిన హీరో అతనే… అందరికీ షాక్ ఇచ్చిన రష్మీ!

సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల గురించి పెద్ద ఎత్తున ఏదో ఒక వార్తలు చక్కర్లు కొట్టడం సర్వసాధారణం. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారి గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే బుల్లి తెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ గురించి అందరికీ తెలిసిందే.ఈమె కెరియర్ మొదట్లో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.

 

ఇకపోతే గత కొద్ది రోజులుగా రష్మీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది రష్మీకి ఒక హీరో ఖరీదైన బంగ్లా గిఫ్ట్ గా ఇచ్చారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.ఈ క్రమంలోనే ఈ వార్తల గురించి ఈమె స్పందించి క్లారిటీ ఇచ్చారు.. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా ఇలా తమ గురించి వచ్చిన వార్తలను ప్రశ్నిస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే రశ్మికి ఖరీదైన బంగ్లా కొనిచ్చిన హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురయింది.

 

ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ రష్మీ తనకు ఖరీదైన బంగ్లా కొనిచ్చిన హీరో మరెవరో కాదు తానేనంటూ సమాధానం చెప్పారు.నేను రాత్రి పగలు కష్టపడుతూ ప్రతి రూపాయి పోగుచేసుకొని బంగ్లా కారు ఎన్నో విలువైన వస్తువులను కొనుగోలు చేశాను ఇదంతా కూడా నా కష్టార్జితమే అంటూ షాకింగ్ సమాధానం చెప్పారు. రాత్రి పగలు కష్టపడుతూ షూటింగ్ లలోబిజీగా ఉన్న విషయాన్ని ఎవరు గమనించలేదు కానీ ఆ డబ్బుతో నేను కొనుక్కున్న బంగ్లా విషయం మాత్రమే గుర్తించారని ఇలా ఒక ఆడపిల్ల పై ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలను సృష్టించడం సరికాదంటూ ఈ సందర్భంగా ఈమె ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చారు.