సుడిగాలి సుధీర్ రష్మీ గురించి సీక్రెట్ బయటపెట్టిన గెటప్ శ్రీను.. సిగ్గుతో మురిసిపోయిన రష్మి!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుధీర్ రష్మీ జంటగా మంచి గుర్తింపు పొందారు. జబర్దస్త్ షోలో రష్మీ యాంకర్ గా వ్యవహరించగా సుడిగాలి సుధీర్ టీం లీడర్ గా కొనసాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా రశ్మిని లైన్లో పెట్టాడు. వీరిద్దరూ షో రేటింగ్స్ కోసమే కలిసిన కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ నిజంగానే వీరిద్దరూ ప్రేమికులు అన్నంతగా కలిసిపోయారు. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో సుధీర్ రష్మీ మొదటిసారిగా కలిసిన విషయం గురించి గెటప్ శ్రీను సీక్రెట్ బయట పెట్టాడు.

21వ తేదీ ప్రసారం కానున్న ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో గెటప్ శ్రీను రాంప్రసాద్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో స్కిట్ చేశారు. స్కిట్ అయిపోయిన తర్వాత రష్మీ అందరిని జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఏం కోరుకుంటారు అని ప్రశ్నించింది. ఈ క్రమంలో సన్నీ మాట్లాడుతూ ఒక్కరోజు వెనక్కి వెళ్లాలని కోరుకుంటా. ఎందుకంటే.. నిన్న నేను మందు తాగలేదు అంటూ అందరిని నవ్వించాడు. ఆ తర్వాత జీవితంలో వెనక్కి వెళ్లే ఛాన్స్ వస్తే నువ్వు ఎక్కడికి వెళతావు ? అని ఆటో రాంప్రసాద్ రష్మీని ప్రశ్నించాడు.

వెంటనే గెటప్ శ్రీను కల్పించుకుంటూ నాకు తెలుసు అని చెప్పాడు. రష్మీ, సుడిగాలి సుధీర్ మొదటిసారి కలిసిన విషయం గురించి శ్రీను పరోక్షంగా కామెంట్స్ చేస్తూ… 2014 ఫిబ్రవరి 14 న వాలంటైన్స్ డే రోజున అంటూ శ్రీను హార్ట్ సింబల్ చూపించాడు. అయితే గెటప్ శ్రీను అలా అనటంతో రష్మీ ఒకవైపు సంతోష పడుతూనే.. మరొకవైపు సిగ్గుపడుతూ మెలికలు తిరిగింది. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లో లేకపోయినా కూడా అతని గురించి ప్రతివారం ప్రస్తావన తీసుకువస్తూనే కామెడీ చేస్తున్నారు.