బుల్లితెర నటుడు పవిత్రనాథ్‌ కన్నుమూత!

బుల్లితెర మీద అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్‌ లలో ‘మొగిలిరేకులు’ సీరియల్‌ లో ‘దయ’ పాత్రలో నటించిన, అందరికీ సుపరిచితుడు అయిన పవిత్రనాథ్‌ కన్నుమూశారు. ఈ విషయాన్ని సహచర నటుడు ఇంద్రనీల్‌ భార్య మేఘన తన సామాజిక మాధ్యమం ద్వారా చెప్పడంతో అందరికీ తెలిసింది. ‘ఈ వార్త నిజం కాకూడదు అని అనిపిస్తే ఎంతో బాగుండేది అనిపిస్తుంది. నువ్వు ఎంతో ముఖ్యమైన వ్యక్తివి మాకు, నువ్వు ఇలా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవటం చాలా బాధగా వుంది. నీకు కనీసం వీడ్కోలు కూడా చెప్పలేకపోయాం’ అని పెట్టారు.

ఇంద్రనీల్‌ భార్య తన సామాజిక మాధ్యమంలో పవిత్రనాథ్‌ గురించి పోస్ట్‌ పెట్టారు కానీ, పవిత్ర నాథ్‌ ఎలా మరణించింది, ఏమైంది అనే విషయాలు మాత్రం బయటకి రాలేదు అని తెలుస్తోంది.

‘మొగిలి రేకులు’ సీరియల్‌ తో పాటు ఇంకో సీరియల్‌ ‘చక్రవాకం’ లో కూడా పవిత్రనాథ్‌ నటించాడు. ఈ రెండు సీరియల్స్‌ అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్స్‌. ఇందులో ఆ నటులు నిజమైన పేర్లు కాకుండా, సీరియల్స్‌ లోని పాత్రల పేర్లే ప్రేక్షకులకి ఎక్కువ గుర్తుండిపోయాయి అని చెపుతూ వుంటారు.