కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ దివి.. డబ్బులు లేకుండా చేస్తాను అంటూ..?

కాస్టింగ్ కౌచ్..ఈ పేరు ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది నటీమణులు ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో స్పందించిన విషయం తెలిసిందే. అలాగే పలువురు హీరోయిన్ లు కెరియర్ లో వారికి ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను కూడా చెప్పుకొచ్చారు. కేవలం వెండితెర సెలబ్రిటీలు మాత్రమే కాకుండా బుల్లితెర పైన నటించే సెలబ్రిటీలు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నారట. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది బిగ్ బాస్ బ్యూటీ దివి.

బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దివి.. మోడలింగ్ రంగం నుంచి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తనకు క్యాస్టింగ్ కౌచ్ అంటే తెలియనిది కాదని, కానీ ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తనను బట్టి ఉంటుంది అని ఆమె చెప్పుకొచ్చింది. ఇద్దరూ ఇష్టపడి ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే అది తన దృష్టిలో తప్పు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది దివి. అలాకాకుండా ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా బలవంతంగా చేయడం అనేదాన్ని తప్పు అని ఆమె తెలిపింది. అంతే కాకుండా ఇన్నేళ్ల ఆమె కెరియర్ లో ఎప్పుడూ ఆమెకు అటువంటి పరిస్థితులు ఎదురవ్వలేదని ఆమె తెలిపింది.

అంతేకాకుండా ఎవరైనా పెద్ద హీరోలు కానీ లేదంటే పెద్ద డైరెక్టర్స్ కానీ ఆఫర్ ఇస్తే రెమ్యూనరేషన్ తీసుకోకుండానే నటిస్తాను అని చెప్పుకొచ్చింది దివి. ఏదేనా పెద్ద బ్యానర్ పెద్ద డైరెక్టర్.. ఇలా మంచి పేరు మూవీ మేకర్ల దగ్గర ఎవరైనా సరే తనకు అవకాశం ఇస్తే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటానని అందు కోసం డబ్బులు ఇవ్వకపోయినా వారి కోసం పని చేస్తాను అని గట్టిగానే చెప్పింది దివి. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న దివి ఈ ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.