ఈటీవీ నుండి వెళ్లి మాటీవీలో పాగా వేసిన అవినాష్.. హైపర్ ఆదికి ఏమాత్రం తగ్గలేదుగా?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది గుర్తింపు పొంది ఇండస్ట్రీలో కమెడియన్లుగా పాపులర్ అయ్యారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన చాలామంది జబర్దస్త్ కి దూరమై మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షోస్ లో సందడి చేస్తున్నారు. ఇలా జబర్దస్త్ కి దూరమై మాటీవీ కి వెళ్ళిన వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన అవినాష్ బిగ్ బాస్ లో అవకాశం రావడంతో జబర్దస్త్ కి దూరమయ్యాడు.

ఆ తర్వాత మా టీవీ వారితో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం మా టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న షోస్ లో సందడి చేశాడు ఈ క్రమంలో అవినాష్ మాటీవీలో ప్రసారమవుతున్న అన్ని కార్యక్రమాలలోనూ అవకాశం దక్కించుకున్నాడు ఇలా అవకాశాలు పొందుతూ ఇప్పుడు మా టీవీ కి స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం మాటీవీలో ఏ ఈవెంట్ చేయాలన్నా కూడా అవినాష్ ఉండాల్సిందే అన్న పరిస్థితికి వచ్చేసింది ఒక కొత్త షో ప్రారంభించాలన్న లేదంటే ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నా కూడా అందులో ముక్కు అవినాష్ ఉండాల్సిందే . ఇలా రోజురోజుకీ తన గుర్తింపు పెంచుకుంటూ అవినాష్ మాటీవీలో బాగా వేశాడు.

అయితే ప్రస్తుతం జబర్దస్త్ లో ప్రసారమవుతున్న అన్ని కార్యక్రమాలకి ఆది మూల స్తంభంల నిలబడ్డాడు. ఈటీవీలో ఏ కార్యక్రమం ప్రసారమైన కూడా అందులో ఆది ఉండాల్సిందే. ఇలా ఈటీవీలో ఆది.. మాటీవీలో అవినాష్ బాగా సెట్ అయ్యారు. అయితే ప్రస్తుతం అవినాష్ కి మా టీవీ వారు ఇచ్చే రెమ్యునరేషన్ మల్లెమాలవారు ఆదికి ఇచ్చే రెమ్యూనరేషన్ తో సమానంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాగే కొనసాగితే ఆదికి సమానంగా అవినాష్ పాపులారిటీ సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.