బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ని తేల్చే ఓటింగ్ శుక్రవారంతో ముగిసింది. ఆదివారం రాత్రి నుంచే ప్రారంభమైన బిగ్ బాస్ చివరివారం ఓటింగ్ శుక్రవారం రాత్రి తో క్లోజ్ అయింది. 2024 సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 డిసెంబర్ 15 ఆదివారం నాటి గ్రాండ్ ఫినాలే తో ముగుస్తుంది. 16 మంది ఓజీ క్లాన్ 5 మంది రాయల్ క్లాన్ సభ్యులతో మొత్తం 22 మంది ఈ సీజన్ లో పాల్గొని టైటిల్ కోసం పోటీపడ్డారు.
అయితే చివరివారం వచ్చేసరికి ఐదుగురు మాత్రం ఫైనల్ కి చేరుకున్నారు. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ పోటీలో ఉండగా ఎక్కువగా గౌతమ్ కి నిఖిల్ కి మధ్య పోటీ జరుగుతుంది. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తొలి రోజు నుంచి ఈ ఇద్దరికీ 80 శాతం ఓట్లు పడ్డాయి.మిగిలిన 20 శాతం ఓటింగ్ ని నవీన్, ప్రేరణ, అవినాష్ లు పంచుకున్నారు.
తొలి రోజు నుంచి ఐదో రోజు వరకు ఈ ముగ్గురు స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు కానీ టైటిల్ రేసులో ఉన్న నిఖిల్, గౌతమ్ స్థానాలు మాత్రం తారుమారయ్యాయి. మొదటిరోజు ఓటింగ్ లో నిఖిల్ ఉండగా రెండో రోజు నుంచి గౌతమ్ ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ ఆన్లైన్ పోల్స్ శుక్రవారం అర్ధరాత్రి ముగిసే సమయానికి గౌతమ్ 38% ఓటింగ్ తో టాప్ లో ఉన్నాడు.
నిఖిల్ కి 33% ఓట్లు పడ్డాయి. వీళ్లిద్దరి మధ్య కేవలం ఐదు శాతం మాత్రమే ఓట్లు తేడా ఉంది. ఇక మూడో స్థానంలో నబిల్ 16% ఓటింగ్ సాధించగా ప్రేరణ తొమ్మిది శాతం ఓటింగ్ సాధిస్తే అవినాష్ నాలుగు శాతం ఓటింగ్ సాధించాడు. ఎవరి ఓటింగ్ ఎలా ఉన్నా బిగ్ బాస్ లెక్కలు వేరేగా ఉంటాయి కాబట్టి విన్నర్ ఎవరనేది తెలియాలంటే డిసెంబర్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే.