కామెడీ ఎక్సేంజ్ 2లో అనీల్ రావిపూడి..

ప్రేక్షకులకు మనసుకు ఉల్లాసాన్ని కలిగించే అపరిమితమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న వన్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఆహా రూపొందించిన కార్యక్రమం ‘కామెడీ ఎక్సేంజ్’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలుసు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు కామెడీ ఎక్సేంజ్ 2 ప్రేక్షకులను మెప్పిస్తుంది. చక్కటి చమత్కారం కలగలిసిన ఇలాంటి షోలో భాగం కావటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనీల్ రావిపూడి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామెడీ ఎక్సేంజ్ వంటి ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగం కావటం చాలా ఆనందంగా ఉందని. ఎగ్జయిటెడ్‌గానూ ఉందన్నారు. షోలో పాల్గొనే కమెడియన్ చేసే ప్రదర్శనలను చూసిన ఆడియెన్స్ వారికి వేసే ఓట్ల ఆధారంగా కొన్ని స్టాక్స్‌ను కేటాయిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా తనకు తన చుట్టు పక్కల వారిని నవ్విస్తూ ఉండటం అనేది ఎంతో చెప్పలేని సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. కుటుంబం, స్నేహితులందరూ కలిసి చూసే ఎంటర్‌టైన్‌మెంట్ ఉండటం ఎంత ముఖ్యమనే విషయాన్ని, ప్రాముఖ్యతను ఆయన వివరించారు.

ఇదే సందర్భంలో కామెడీ ఎక్సేంజ్‌లో పాల్గొన్న కమెడియన్స్‌ను ఈసందర్భంగా అనీల్ రావిపూడి అభినందించారు. ఇలాంటి వేదికను ఏర్పాటు చేసి సరిహద్దుల్లేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించే ప్రయత్నం చేస్తున్న ఆహాకు ఈ సందర్భంలో ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

కామెడీ ఎక్సేంజ్ 2 కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులతో పాటు హరి, సద్దాం, రోహిణి, అవినాష్, రాజు, జ్ఞానేశ్వర్-భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైడ్ స్పిట్లింగ్ స్కిట్స్‌తో మీడియా సహా అందరినీ ఎంటర్‌టైన్ చేశారు

అందరినీ మనస్ఫూర్తిగా కమెడియన్స్ తమ ప్రదర్శనలతో నవ్వించారు. తదనంతరం మీడియా ప్రతినిధులు యాంకర్ శ్రీముఖి, కమెడియన్స్‌ని ప్రశ్నోత్తరాలు అడగ్గా వారు సమాధానం చెప్పారు. ఈ ఇష్టాగోష్టి అనేది కార్యక్రమానికి మరింత వినోదాన్ని జోడించింది.