Gallery

Home TV SHOWS అందుకే పెళ్లిపై ఆసక్తి లేదు.. బ్రేకప్ స్టోరీ చెప్పిన యాంకర్ వర్షిణి!!

అందుకే పెళ్లిపై ఆసక్తి లేదు.. బ్రేకప్ స్టోరీ చెప్పిన యాంకర్ వర్షిణి!!

బుల్లితెరపై యాంకర్ వర్షిణి చేసే రచ్చ అందరికీ తెలిసిందే. యూట్యూబ్, వెబ్ సిరీస్ నుంచి బుల్లితెరకు వచ్చిన వర్షిణి అతి తక్కువ కాలంలోనే యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకుంది. యాంకర్ అంటే తెలుగులో అనర్గళంగా మాట్లాడాల్సిన పని లేదని అందంగా ఉంటే చాలని అనుకుంటున్న రోజుల్లో విష్ఱు ప్రియ, వర్షిణి వంటి వారు యాంకర్లుగా ఎదిగేశారు. స్టార్డం తెచ్చేసుకున్నారు. వీరు ఇప్పుడు సోషల్ మీడియాలో, బుల్లితెరపై సెలెబ్రిటీ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు.

Anchor Varshini Breakup Story,Varshini
Anchor Varshini Breakup Story,Varshini

పటాస్, ఢీ షోలతో వర్షిణి బాగా ఫేమస్ అయింది. మరీ ముఖ్యంగా ఢీ షోలో ఆమెపై వేసే కౌంటర్లు, ఆమె చేసే పిల్ల చేష్టలు, ఆ మధ్య డ్యాన్స్ రానప్పుడు వేసిన వింత మూన్ వాక్ స్టెప్పులు ఆమెను బాగానే ఫేమస్ చేశాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే హైపర్ ఆదితో వర్షిణి చేసిన కెమిస్ట్రీ ఫుల్లుగా వర్కౌట్ అయింది. ఎంతలా అంటే యూట్యూబ్‌లో వీరి పెళ్లి వార్తలు దావానంలా వ్యాప్తిచెందే వరకు వచ్చింది.

Anchor Varshini Breakup Story,Varshini
Anchor Varshini Breakup Story,Varshini

అయితే ఎన్నడూ కూడా వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి మాట్లాడలేదు. కేవలం స్నేహితులమేనని చెప్పుకునే వారు. కానీ తాజాగా వర్షిణి మాత్రం తన మనసులోని మాట చెప్పేసింది. పెళ్లిపై అభిప్రాయాన్ని చెబుతూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. పెళ్లి ఎందుకు ఇలా ఉంటే హ్యాపీగా ఉందని చెప్పింది. గతంలో ఏదైనా ఉందా అంటే.. అవును ఉంది కానీ సెట్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. నీకు సెట్ కాలేదా? అవతలి వారికి సెట్ కాలేదా? అని అడిగితే ఇద్దరికీ సెట్ కాలేదని వర్షిణి తెలిపింది. ఇలా మొత్తానికి బ్రేకప్ కావడంతో పెళ్లిపై ఇంట్రెస్ట్ పోయినట్టు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Posts

40 రోజుల్లో రాజమౌళి నుండి విడుదల పొందనున్న చరణ్, ఎన్టీఆర్

  రాజమౌళి సినిమా అంటే చాలా ఓపిక ఉండాలి. ఆయనతో సినిమా చేయాలి అనుకుంటే కనీసం రెండేళ్లు ఆయానకు అంకితం చేయాల్సిందే ఏ హీరో అయినా. అంటే రెండేళ్ల పాటు వెండితెర మీద కనబడరనే...

ఉపాసన చేతికి అరుదైన, కీలకమైన బాధ్యతలు

  ఉపాసన కొణిదెల సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు ఉంటారు. ఒకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడ నిర్వర్తిస్తుంటారు. ఇటీవల కాలంలో కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ప్రజల్లో అవగాహన...

‘మా’ ఎన్నికల బరిలోకి లేడీ..రసవత్తరంగా మారిన పోటీ

మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి.  ఎప్పుడో సెప్టెంబర్లో జరగబోయే ఎన్నికల వేడి ఇప్పటి నుండే ఇండస్ట్రీని తాకుతోంది. బలమైన వ్యక్తులు బరిలోకో దిగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది....

Latest News