వామ్మో… అనసూయా మళ్లీ మొదలెట్టిందిగా.. మరోసారి నేటిజన్లని గెలికిన అనసూయ?

బుల్లితెర హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇలా వరుస షూటింగ్ లతో బిజీగా ఉంటున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇక సోషల్ మీడియాలో అనసూయ తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తరచు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది.

అనసూయ ధరించే దుస్తులు.. ఆమె చేసే వ్యాఖ్యల వల్ల తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. వివాదాలు లేకపోతే అనసూయకు బోర్ కొడుతుంది అన్నట్లుగా ఆమె పరిస్థితి తయారయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజెన్స్ కి అనసూయకి మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయినా అనసూయ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మాటకి మాట సమాధానం చెబుతూ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక ఇటీవల ఆంటీ అన్న వివాదం కొంత సర్ధుమనిగింది అనుకునే లోపే మరొక వివాదానికి తెరలేపింది.

ప్రస్తుతం అనసూయ అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా అమెరికా వీధుల్లో తిరుగుతూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న అనసూయ అక్కడ దిగిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా అమెరికాలో వివిధ రకాల టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ఎంజాయ్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “నా ఫుడ్ నా ఇష్టం మీకు ఏమైనా ప్రాబ్లమా” అంటూ తానే స్వయంగా నెటిజన్స్ ని గెలికింది. ఇక దీంతో నెటిజన్స్ కూడా రెచ్చిపోయి అనసూయ గురించి తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇలా తిని ఒళ్ళు పెంచుకోవడం ఎందుకు ఆ తర్వాత డైటింగ్ చేయడం ఎందుకు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఇలా తింటూ పోతే.. ఆంటీలా కాకుండా బామ్మల తయారవుతావు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.