నాకు రొమాంటిక్ హీరో ఇమేజ్ వద్దు బాబోయ్!
హీరో నాగశౌర్య క్రమంగా ‘యాక్షన్’ హీరోయిజంపైనా ఫోకస్ పెడుతున్నాడు. అవును ఇది నిజంగా నిజం! సింఫుల్ రొమాంటివ్ లవ్ డ్రామా చిత్రాలు చేస్తూ వచ్చిన నాగశౌర్య ‘యాక్షన్’ హీరోయిజంపై ఎందుకు ఫోకస్ పెడుతున్నాడు? అనేగా మీ డౌట్. ఐరా క్రియేషన్స్‌పై కొత్త దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తోన్న తాజా ప్రాజెక్టులో నాగశౌర్య పూర్తిస్థాయి యాక్షన్ కొరియోగ్రఫీపై ఫోకస్ పెట్టినట్టు చిత్రబృందం చెబుతోంది. శంకర్‌ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాతగా రూపుదిద్దుకుంటోన్న ప్రొడక్షన్ నెం3 ప్రాజెక్టులో నాగశౌర్యతో బబ్లీ బ్యూటీ మెహరీన్ జోడీ కట్టింది. క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే ఉద్దేశంతో ప్రాజెక్టులో ఒకింత యాక్షన్ డోస్ పెంచారని యూనిట్ సభ్యుల సమాచారం.
గతేడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన కేజీఎఫ్ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్టర్ తెలుగులో తొలిసారి నాగశౌర్య చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. అన్బు అరివు యాక్షన్ కంపోజిషన్ అద్భుతంగా ఉందని, ప్రాజెక్టు సరికొత్త హైట్స్‌కు చేరడం ఖాయమని దర్శక నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సినిమా కోసం డిజైన్ చేసిన కట్‌లేని మూడు నిమిషాల సన్నివేశం సైతం ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభూతి అందించగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమధ్యే వైజాగ్ షూట్‌లో యాక్షన్ సీన్ చేస్తూ గాయపడిన నాగశౌర్య, సినిమా ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో కోలుకోకముందే షూటింగ్‌కు హాజరవ్వడం హీరో డెడికేషన్‌కు అద్దం పడుతోందన్న ఆనందం యూనిట్ సభ్యుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయం గురించే నాగశౌర్య ను అడిగితే – అవును. ఇకపై నా సినిమాల్లో యాక్షన్ తో పాటు అన్నీ సమపాళ్లలో ఉండి ప్రేక్షకులను అలరిస్తాయి అని చెప్పుకొచ్చాడు.