కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నాగశౌర్య.. ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగశౌర్య నేడు తాను ప్రేమించిన అనూష శెట్టి అనే అమ్మాయిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.నాగశౌర్య బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో వీరి వివాహం చేసుకున్నారు. వీరి వివాహం నేడు బెంగళూరులో ఎంతో ఘనంగా జరిగింది.

నిన్నటి నుంచి నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. ఈయన హల్దీ సంగీత ఫంక్షన్లకు సంబంధించిన ఫోటోలు అన్నింటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇకపోతే నేడు ఉదయం 11:25 కిబంధుమిత్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో నాగశౌర్య అనూష మెడలో మూడు ముళ్ళు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక నాగశౌర్య వివాహానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు నేటిజెన్లు ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగశౌర్య అనూష ఇద్దరు కూడా పట్టు వస్త్రాలను ధరించి ఎంతో సాంప్రదాయబద్ధంగా వీరి వివాహాన్ని జరుపుకున్నారు. ప్రస్తుతం నాగశౌర్య పెళ్లి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.