త్రివిక్ర‌మ్ ప్లాన్‌కి యంగ్ డైరెక్ట‌ర్ అప్‌సెట్‌!

యువ‌దర్శ‌కుడికి అలా చెక్ పెట్టాడు!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ప్లాన్ ఛేంజ్‌ కార‌ణంగా ఓ యంగ్ డైరెక్ట‌ర్ అప్‌సెట్ కావాల్సి వ‌చ్చింది. ఏకంగా త‌న షెడ్యూల్‌నే మార్చుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. త్రివిక్ర‌ముని కొత్త నిర్ణ‌యం స‌ద‌రు యువ‌ద‌ర్శ‌కుడి షెడ్యూల్స్ ని తీవ్రంగా డిస్ట్ర‌బ్ చేసింద‌ట‌. వివ‌రాల్లోకి వెళితే.. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న‌ `అల వైకుంఠ‌పుర‌ములో..` షెడ్యూల్స్ లో అనూహ్య మార్పు చేయాల్సి వ‌చ్చింద‌ట‌. అయితే వీరి ప్లాన్ కార‌ణంగా యంగ్ డైరెక్ట‌ర్ వేణు ఉడుగుల ప్లాన్ డిస్ట్ర‌బ్ అయ్యింద‌ని తెలుస్తోంది.

<

p style=”text-align: justify”>త్రివిక్ర‌మ్ కంటే ముందే వేణు ఉడుగుల సినిమాకి సీనియ‌ర్ న‌టి టబు అంగీక‌రించార‌ట‌. రానా- వేణు ఉడుగుల కాంబినేష‌న్ మూవీ విరాట‌ప‌ర్వం నుంచి ట‌బు త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. నీది నాది ఒకే క‌థ‌` త‌ర్వాత‌ వేణు ఊడుగు కెరీర్ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంగా భావిస్తున్నార‌ట‌. న‌క్స‌లిజం నేప‌థ్యంలో చిత్ర‌మిది. బెల్లి ల‌లిత హ‌త్య‌, మాన‌వ హ‌క్కుల సంఘాల నేత‌ల ఆందోళ‌న‌, ఓ న‌క్స‌లైట్ నాయ‌కుడి పోరాటం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని 90వ ద‌శ‌కంలో తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి, రానా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాలో మాన‌వ హ‌క్కుల నేత పాత్ర కోసం ట‌బుని తీసుకున్నారు. కానీ త్రివిక్ర‌మ్ కార‌ణంగా ఈ సినిమా నుంచి ట‌బు త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. యూనిట్‌కు ఇచ్చిన డేట్స్ దాటిపోవ‌డం, త్రివిక్ర‌మ్ సినిమాని అంగీక‌రించ‌డం వంటి కార‌ణాల‌తో ట‌బు విరాట ఫ‌ర్వం నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో నందితా దాస్‌ని చిత్ర బృందం ఖ‌రారు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ ప్లాన్ ఛేంజ్ వ‌ల్ల‌నే డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల అప్ సెట్ అయ్యార‌ని చెప్పుకుంటున్నారు.