Home News సుకుమార్ రెమ్యూనరేషన్ అంతా ?? రాజమౌళి , త్రివిక్రమ్ కూడా పనికిరారు.

సుకుమార్ రెమ్యూనరేషన్ అంతా ?? రాజమౌళి , త్రివిక్రమ్ కూడా పనికిరారు.

సుకుమార్ రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. సుకూమార్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమా ఆర్య తోటే ఒక క్రేజ్ వచ్చేసింది. ఆ క్రేజ్ సినిమా సినిమాకి పెరిగిపోయింది. సుకుమార్ సినిమా అంటే ఖచ్చితంగా కొన్ని లెక్కలుంటాయన్న మైండ్ సెట్ కి అందరూ వచ్చేశారు. ఫ్లాప్ సినిమా అన్న మహేష్ బాబు 1 నేనొక్కడినే కూడా స్క్రీన్ ప్లే పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఫస్ట్ టైం కల్ట్ కంటెంట్ తో తీసిన రంగస్థలం సినిమా సుకుమార్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా గా నిలిచిపోయింది.

Sukumar Plans To Complete Half Of Pushpa In 2020 1 | Telugu Rajyam

అందుకే రంగస్థలం సినిమా తర్వాత అందరు హీరోలు సుకుమార్ ని అలాంటి కథే అడుగుతున్నారు. ఈ క్రమంలోనే సుకుమార్ తో అల్లు అర్జున్ పుష్ప అన్న సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ గా మార్చిన సుకుమార్ ఇప్పుడు మరొక ఇమేజ్ తేవడానికి ట్రై చేస్తున్నాడు. అలు అర్జున్ కెరీర్ లోనే కనిపించని విధంగా కొత్త మేకోవర్ తో తీసుకు వస్తున్నాడు. పుష్ప సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది. కాని ఫస్ట్ టైం సుకుమార్ తీసుకునే రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా బడ్జెట్ దాదాపు 180 కోట్లు అంటుండగా సుకుమార్ రెమ్యూనరేషన్ 23 నుంచి 25 కోట్లు తీసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఎక్కువ అన్న మాట వినిపిస్తోది. సుకుమార్ తనకున్న క్రేజ్ ని బట్టి గట్టిగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని అంటున్నారు. ఇక లాభాలల్లో వాటా కూడా ఉంటుందని అది కూడా కలిపితే చాలానే రెమ్యూనరేషన్ సుకుమార్ కి అందుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు గాని సుకుమార్ రేంజ్ పెరిగిందని మాత్రం చెప్పుకుంటున్నారు.

- Advertisement -

Related Posts

అఖిలపక్షంతో వస్తాను..అపాయింట్‌మెంట్ ఇవ్వండి: మోదీకి జగన్ మరో లేఖ

ఏపీ సీఎం జగన్ మరోసారి ప్రధాని మోదీకి లేఖ రాశారు.. సోమవారం పార్లమెంట్ లో విశాఖ ఎంపీ సత్యన్నారయణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదంటూ కేంద్ర ఆర్థిక...

మంత్రి బుగ్గన సంచలన ప్రకటన: కర్నూలులో 250 ఎకరాల్లో హైకోర్టు!

కర్నూలులోని జగన్నాథగుట్ట ప్రాంతంలో 250 ఎకరాల్లో రాష్ట్ర హైకోర్టు నిర్మితమవుతుందనీ, జ్యుడీషియల్ క్యాపిటల్ ప్రక్రియ హైకోర్టు నుంచి సానుకూల తీర్పు వచ్చిన తర్వాత ప్రారంభమవుతుందనీ వైసీపీ ముఖ్య నేత, ఏపీ ఆర్థిక మంత్రి...

రెండో వివాహం చేసుకున్న అమెజాన్‌ వ్యవస్థాపకుడి మాజీ భార్య !

ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు, అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య మెకెంజీ స్కాట్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన సైన్స్‌ టీచర్‌ డాన్‌ జీవెట్‌ను ఆమె వివాహమాడారు. ఈ...

Latest News