రీమేక్ సినిమాలను తెరకెక్కించడం అంత చిన్న విషయమేమీ కాదు. మన ప్రాంతం, పద్దతులు, జీవిన విధానం ఇలా అన్నింటికి సరిపడా మార్పులు చేర్పులు చేసుకోవాలి. కథలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడి జనాలను ఆకట్టుకునేలా పదునైనా మాటలు ఉండాలి. ఇవన్నీ రాయగల సమర్థుడు త్రివిక్రమ్. ఓ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందించి స్క్రిప్ట్ రాశాడంటే అది చాలా వరకు హిట్ అవ్వాల్సిందే.
ఎందుకంటే ఎక్కడి కథనైనా సరే త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి ఈజీగా మార్చేయగలడు. అందుకు నువ్వే కావాలి సినిమా ఇప్పటికీ తెలుగులో పుట్టిన కథే అని అందరూ భావిస్తారు. కానీ అది మళయాలి సినిమాకు రీమేక్. ఇలా త్రివిక్రమ్ ఎన్నో రీమేక్‌లకు స్క్రిప్ట్‌ను అందించాడు. తాజాగా మరో రీమేక్‌కు తన కలాన్ని వాడేశాడు. అది కూడా పవన్ కళ్యాణ్ కోసం. యువ దర్శకుడు సాగర్ చంద్ర అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను పవన్ కళ్యాణ్ రానాలతో కలిసి తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే ముందు నుంచి ఈ రీమేక్‌పై చాలా రకాల రూమర్లు వినిపించాయి. ఈ రీమేక్ పట్టాలెక్కేందుకు కూడా కారణం త్రివిక్రమే. అటు పవన్ కళ్యాణ్‌ను ఇటు నిర్మాతను ఒప్పించింది కూడా ఇతనే. అసలు దర్శకత్వం కూడా ఇతనే చేయాలి. కానీ చివరి నిమిషంలో సాగర్ చంద్ర చేతికి వచ్చింది. పేరుకు మాత్రమే దర్శకుడు అయ్యాడు. కానీ అన్ని కూడా త్రివిక్రమ్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. పైగా అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. అంటే సాగర్ చంద్ర కేవలం అలా పేరుకు ఉంటాడు. మధ్యలో పాపం సాగర్ చంద్ర బక్రా అయ్యేలా కనిపిస్తున్నాడు.