Gallery

Home News త్రివిక్రమ్ - రామ్ కాంబినేషన్ ఫిక్స్.. ఇంతకంటే ప్రూఫ్ ఇంకేం కావాలి ..?

త్రివిక్రమ్ – రామ్ కాంబినేషన్ ఫిక్స్.. ఇంతకంటే ప్రూఫ్ ఇంకేం కావాలి ..?

త్రివిక్రమ్ – రామ్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ లోనూ అలాగే సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కాని ఈ విషయాన్ని అటు త్రివిక్రమ్ గాని ఇటు రామ్ గాని వెల్లడించలేదు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కాంబినేషన్ లో సినిమా ఉండబోతోందని అర్థమవుతోంది. ఎనర్జిటిక్ హీరో రామ్ ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ హిట్ తర్వాత ఈ ఎనర్జిటిక్ హీరో నుంచి మళ్ళీ సినిమా రాలేదు.

Red Teaser Review

ఇస్మార్ట్ శంకర్ లాంటి కెరీర్ బెస్ట్ సినిమా చేసిన రామ్ ‘రెడ్’ సినిమాతో వచ్చి అంతకు రెండింతలు హిట్ కొట్టాలనుకున్నా రామ్ తమిళ హిట్ ‘తడమ్’ మీద ఆసక్తి చూపించాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి మరో మాస్ హిట్ కొట్టాలంటే ‘తడమ్’ బెస్ట్ ఆప్షన్ అని డిసైడయ్యాడు. రామ్ తో … ఇప్పటికే నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలని తీసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమా రూపొందింది. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. రెడ్ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ .. సాంగ్స్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పారు.

Will Trivikram Team Up With Ram? | Telugubulletin.com

ఆ అంచనాలను అందుకుందని ఇప్పుడు ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇన్ని నెలలు రెడ్ సినిమా మీద నమ్మకంతో ఓటీటీకి వెళ్ళకుండా వేయిట్ చేసిన చిత్ర యూనిట్ మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకుంది. కాగా ఈ సినిమా తర్వాత రామ్ చేయబోయే సినిమా మీద చర్చలు మొదలయ్యాయి. అయితే పూరి జగన్నాధ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ఉండే అవకాశాలున్నాయన్న మాట వినిపిస్తోంది. అలాగే రీసెంట్ గా రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ పెదనాన్న గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. అంతేకాదు రీసెంట్ గా రామ్ కూడా త్రివిక్రమ్ తో సినిమా ఉండబోతుందనే హింట్ ఇచ్చాడు. అయితే అది ఎప్పుడన్నది క్లారిటీ లేదు. కాగా త్రివిక్రమ్.. ఎన్.టి.ఆర్ సినిమా తో పాటు రామ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఇప్పటికే త్రివిక్రమ్ ..రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ కి మాటిచ్చాడని సమాచారం.

- Advertisement -

Related Posts

Sonu Sood: ఐఫోన్ అడిగిన నెటిజన్..! దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సోనూసూద్

Sonu Sood: గతేడాది కరోనా సమయంలో మొదలైన సోనూసూద్ దాతృత్వం ఇప్పటికీ.. సెకండ్ వేవ్ లో కూడా కొనసాగుతూనే ఉంది. కాలినడకన పయనమైన వలస కూలీలను బస్సుల్లో స్వస్థలాలకు చేరవేయడమే కాదు.. తన...

Biscuit Packet: రిమోట్ కారు ఆర్డరిస్తే.. బిస్కట్ ప్యాకెట్ వచ్చింది..! కస్టమర్ ఏం చేశాడంటే..

Biscuit Packet: ప్రస్తుతం అంతా ఆన్ లైన్ యుగం. టిఫిన్, భోజనం, నిత్యావసరాలు, దుస్తులు, ఇంట్లో టీవీ, వంటింట్లో ఫ్రిజ్, బాత్ రూమ్ లో గ్రీజర్, బెడ్ రూమ్ లో మంచం, హాల్లో...

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం.. పార్టీల మధ్యనా.? ప్రభుత్వాల మధ్యనా.?

ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇంకోసారి భగ్గుమంది. రాజకీయ నాయకులు మాట మీద అదుపు కోల్పోతున్నారు. తెలంగాణ నుంచే దూకుడుగా అనవసరపు మాటలు వస్తున్నాయి. ఆంధ్రపదేశ్ నుంచి కాస్త సంయమనమే...

Latest News