స్వర్ణ యుగంలో టాలీవుడ్ ఆశ‌లు నిజ‌మ‌య్యేనా?

tollywood

                                    2021లో భారీ చిత్రాలతో వినోదాల విందు

2020 గాయ‌బ్… మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు అత‌లాకుత‌లం అయ్యింది. వినోద‌ప‌రిశ్ర‌మ‌లు భారీ న‌ష్టాల్ని చ‌వి చూశాయి. 2021 ఎలా ఉండ‌బోతోంది? అంటే ఇప్పుడే చెప్ప‌లేం. అయితే ఫిలింస‌ర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. కోవిడ్ కి వ్యాక్సినో లేక టీకానో క‌నిపెట్టేస్తే ఇక వ‌రుస‌గా భారీ చిత్రాల‌తో వినోదాల విందు ఖాయ‌మైన‌ట్టేన‌న్న‌ది ఆశావ‌హుల మాట‌.

టాలీవుడ్ బ‌డా నిర్మాణ సంస్థలు రాబోయే సంవత్సరాల్లో భారీ ఆదాయాన్ని తెస్తాయని ఆశాభావం  వ్య‌క్త‌మ‌వుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ స్వర్ణ యుగంలోకి ప్రవేశిస్తుందని అగ్ర దర్శకుడు రాజమౌళి అభిప్రాయపడ్డారు. ప్రజలు మా నుండి ఉత్తమ‌మైన కంటెంట్ ని డిమాండ్ చేస్తున్నందున అన్ని బ‌డా నిర్మాణ సంస్థ‌లు.. నిర్మాతలు గొప్ప కంటెంట్‌తో సిద్ధంగా ఉండాలని అన్నారు. రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది రిలీజ్ చేస్తారు.

రాజ‌మౌళి ఇచ్చేన పిలుపుతో టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లు భారీ ప్రాజెక్టులను ప‌ట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నాయి. దిల్ రాజు బ్యానర్, వైజయంతి ఫిల్మ్స్, మైత్రి మూవీ మేకర్స్, హరిక హాసిని క్రియేష‌న్స్ .. సీతారా ఎంట‌ర్ టైన్ మెంట్స్ .. యువి క్రియేష‌న్స్ ..ఇంకా ఎన్నో ఇతర నిర్మాణ సంస్థలు రాబోయే నెలల్లో నాలుగైదు కొత్త చిత్రాలను ప్రకటించనున్నాయి.

దిల్ రాజు రెండు హిందీ సినిమాలను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఇద్దరు పెద్ద తెలుగు స్టార్ల‌తో ఓ భారీ చిత్రాన్ని ప్రకటించనున్నారు. సీతారా ఎంటర్ టైన్ మెంట్స్ మరో రెండు ఆసక్తికరమైన మిడ్-రేంజ్ సినిమాల్ని నిర్మిస్తూనే ‘అయ్యపనమ్ కోషియం’, ‘కప్పేలా’ రీమేక్‌లను ప్రకటించింది. హరిక హాసిని బ్యానర్ కూడా ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రాన్ని వచ్చే ఏడాది సెట్స్‌కి తీసుకెళుతుంది.

వైజయంతి ఫిల్మ్స్ 50 ఏళ్ల సెల‌బ్రేష‌న్స్ ని పుర‌స్క‌రించుకుని ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 21 ను ప్రకటించింది. దుల్కర్ తో ఓ సినిమాని ప్ర‌క‌టించిన సంగ‌తి విధిత‌మే. వైజ‌యంతి బ్యాన‌ర్ లో 2021 కోసం మరో రెండు కొత్త సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఎన్టీఆర్- అట్లీ చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ లో అల్లు అర్జున్ -సుకుమార్ కాంబో మూవీ పుష్ప సెట్స్ కెళుతోంది. మహేష్ `సర్కారు వారి పాట‌`, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పైప్ లైన్ లో ఉన్నాయి. ఇంకా ఇత‌ర బ్యాన‌ర్లు ప‌లు భారీ చిత్రాల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నాయి.