KGF 2 : అరుదైన రికార్డు అందుకున్న కెజీఎఫ్2… ఆ దేశంలో విడుదలవుతున్న మొదటి సౌత్ సినిమా…!

KGF 2 : కెజీఎఫ్ మొదటి భాగం అంచనాలు లేకుండా విడుదలయి సంచలనం రేపింది. ఏమాత్రం ప్రచారం లేకుండా పాన్ ఇండియా సినిమాగా అవతరించింది. ఇక ఈ సినిమాతో రాత్రికిరాత్రే పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు యష్. ఇక ప్రశాంత్ నీల్ దర్శకుడిగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో ని నేపధ్య సంగీతం కూడా అంతే హిట్ అయింది. సలాం రాకీ భాయ్ పాట ఇండియా అంత ఊపు ఊపేసింది. ఇక కెజీఎఫ్ రెండో భాగం వస్తుందని ప్రకటించడంతో అంచనాలు బాగానే పెరిగిపోయాయి.

కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ప్రేక్షకుల నిరీక్షణ చివరి ఘట్టానికి వచ్చినట్టే త్వరలో రెండవ భాగం విడుదలవడానికి సిద్ధంగా ఉంది.ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇక తూఫాన్ పాట అందరిని అలరించింది.విడుదలవ్వక ముందే సినిమా రికార్డులు నమోదు చేస్తోంది. యూ ట్యూబ్ లో తూఫాన్ పాట రికార్డు వ్యూస్ సాధించింది.

సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది కెజీఎఫ్ 2. గ్రీస్ లో విడుదల అవ్వబోతున్న తొలి సౌత్ చిత్రంగా కేజీఎఫ్ నిలుస్తోంది.ఇక ఈ సినిమాను హుంబల్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు.ఇక యష్ కు జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఇక రవీనా టండన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు.