Salaar: వచ్చే ఏడాదికి సలార్ గా రాబోతున్న ప్రభాస్..!

Salaar: రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మరొక చిత్రం సలార్.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అభిమానుల్లో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.హోంబాలే ఫిలిమ్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెస్ట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తుంది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది.

ప్రశాంత్ నీల్,కేజిఎఫ్ సినిమా తో ఎంతటి విజయాన్ని సాధించారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కే జి ఎఫ్ 2 సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సలార్ సినిమా నుంచి విడుదలైన పాటకు ఇలాంటి క్రేజ్ వచ్చిందా తెలిసిందే. ఈ పాట చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు కూడా తన అభిమాన హీరో ప్రభాస్ సినిమా ఇంకెలా తీస్తారో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి రిలీజైన పోస్టర్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే.

హోంబాలే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగండూర్  ఇటీవల ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ” సలార్ సినిమా 30 శాతం షూటింగ్ ని పూర్తిచేసుకుంది. మిగతా షూటింగ్ ని మే లో మొదలుకానుంది. ఇక ఈ ఏడాది చివరిలోపు షూటింగ్ ని పూర్తిచేసి, 2023 ఏప్రిల్ కానీ, జూన్ లో కానీ సినిమాను రిలీజ్ చేస్తాం” అని చెప్పుకొచ్చారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రానుండటంతో అభిమానులు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు.