తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సినిమా వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. అతను దాదాపు అందరు అగ్ర హీరోల చిత్రాలను చూస్తారు. వాటిపై సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తుంటారు. మినీ రివ్యూలు ఇస్తుంటారు. టాప్ స్టార్స్ చిత్రాలపై ఆయన అభిప్రాయాలు హీరోల అభిమానులను ఆనందపరుస్తాయి.
ఇప్పుడు కేసీఆర్- జగన్ .. ఎన్‌టిఆర్ ఇంటి తలుపు తట్టనున్నారా? ఆయన అభిమానులు చేసిన పనికి ఆ పని చేయక తప్పదా? అంటే అవుననే ఊహాగానాలు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోయిన్ మీరా చోప్రా ‘ఐ డోన్ట్ నో ఎన్టీఆర్’ అని చెప్పినప్పుడు ఎన్టీఆర్ అభిమానుల వీరంగం తెలిసిందే.
సామూహిక అత్యాచార బెదిరింపులతో పాటు యాసిడ్ దాడి చేసి చంపేస్తామని భయపెట్టారు. ఆమె తల్లిదండ్రులను చంపేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వీరంగంపై మీరా చోప్రా ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి మరియు తెలంగాణ సిఎం కెసిఆర్ ఇద్దరికీ ఫిర్యాదు చేశారు.
ఈ బెదిరింపులపై హైదరాబాద్ పోలీస్ ఫిర్యాదు చేశాను. మహిళల భద్రత కోసం ఇది పూర్తిగా దర్యాప్తు చేస్తుందని నేను ఆశిస్తున్నాను అంటూ మీరా చోప్రా నేరుగా కేటీఆర్ ని సంప్రదించారు. KTR దీనికి తిరిగి బదులిచ్చారు “మామ్, మీ ఫిర్యాదు ఆధారంగా చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను తెలంగాణ DGP .. హైదరాబాద్ సీపీని అభ్యర్థించాను“ అని అన్నారు.
మీరా కృతజ్ఞతలు తెలుపుతూ, “ధన్యవాదాలు సార్, ఇది నిజంగా చాలా అర్థవంతమైనది. మహిళల భద్రతకు ఇది చాలా ముఖ్యం. మహిళలపై తెగబడి నేరాలు చేసేందుకు ఎవరికీ స్వేచ్ఛగా ఉంచకూడదు!“ అంటూ మీరా చోప్రా రిప్లయ్ ఇచ్చారు.
ఆమె ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేసింది. ఆమె @ysjagan .. గ్యాంగ్‌రేప్, యాసిడ్ ఎటాక్, దుర్వినియోగం, సైబర్ బెదిరింపు .. నేరాలపై ఫిర్యాదు చేసింది. “@hydcitypolice ఒక సంస్థను దాఖలు చేసింది. మహిళల భద్రత కోసం ఇది. దర్యాప్తు సాగుతుందని నేను ఆశిస్తున్నాను“ అని తెలిపింది.
దీనిని బట్టి కేసీఆర్ – జగన్ నేరుగా ఎన్టీఆర్ అభిమానులపై చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్టీఆర్ తలుపు తట్టబోతున్నారా? మహిళలను వేధిస్తున్న అభిమానుల అతి ప్రవర్తనపై పోలీసుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అన్న చర్చ సాగుతోంది. కారణం ఏదైనా ఎన్టీఆర్ ఈ విషయంపై అభిమానుల తరపున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మంతనాలు సాగించి సారీ చెబుతారా? అన్న చర్చా సాగుతోంది.