మాస్ విజయ్ దేవరకొండ..హాట్ టాపిక్ గా “లైగర్” మాసివ్ కటౌట్..!

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో  విజయ్ దేవరకొండ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రౌడీ హీరో అని సెన్సేషనల్ స్టార్ ని పలు మాస్ టాగ్స్ ఉన్న ఈ యంగ్ హీరో హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా చేసిన లేటెస్ట్ సినిమానే “లైగర్”.

ఓ హీరోని సెపరేట్ గా వేరే లెవెల్లో చూపించే దర్శకుడు పూరి జగన్నాద్ తో చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో వచ్చే నెల రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి అభిమానులు పాన్ ఇండియా ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ కి చిత్ర బృందం అదిరే ప్లానింగ్ లు చేస్తుండగా..

ఇప్పుడు ఒక క్రేజీ అంశం సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది. “లైగర్” లో విజయ్ రోల్ పై ఊహించని లెవెల్లో 75 అడుగుల మాసివ్ కటౌట్ ని హైదరాబాద్ లో ఓ థియేటర్ దగ్గర అరేంజ్ చెయ్యడం వైరల్ గా మారిపోయింది. అయితే ఈ మాస్ ట్రైలర్ రేపు జూలై 21న రిలీజ్ కాబోతుండగా చాలా గ్రాండ్ గానే ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు.

మరి పూరి అయితే విజయ్ తో ఎలాంటి విన్యాసాలు చేయించాడో ఇందులో చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ సహా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటించగా తెలుగు, హిందీ సహా తమిళ్ మలయాళ కన్నడ భాషల్లో ఈ చిత్రం ఏఈ ఆగష్టు 25న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.