సంక్రాతి అల్లుళ్లు..(‘ఎఫ్‌2’ ఫస్ట్‌లుక్‌)

విభిన్న‌మైన కథలు, పాత్ర‌లు ఎంచుకుంటూ కొత్త‌దనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెకంటేష్, ఫిదా, తొలి ప్రేమ చిత్రాల‌తో వ‌రుస సక్సెస్ లు సాధించిన యంగ్ హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్ 2`. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ ట్యాగ్ లైన్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో పూర్తి ఫన్ తో సాగే ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) చిత్రషూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు నిర్మాతలు.

వెంక‌టేశ్ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొంద‌నున్న ఈ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. `ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్ర‌ం కావటంతో సినిమాపై అంచనాలు బాగున్నాయి.


ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “కుటుంబ క‌థా చిత్రాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న ఔట్ అంట్ ఔట్ ఫ్యామిలీ ఫ‌న్ రైట‌ర్ `ఎఫ్‌2`. మెసేజ్‌తో పాటు అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా యాడ్ చేసి లాఫింగ్ రైడ‌ర్‌లాంటి చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మూడు వ‌రుస హిట్స్ త‌ర్వాత చేస్తోన్న చిత్ర‌మిది. వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ సూప‌ర్బ్‌కాంబినేష‌న్‌తో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.

దీపావ‌ళి సంద‌ర్భంగా ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశాం. ఇప్ప‌టి వ‌ర‌కు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. క్లైమాక్స్‌, మూడు పాట‌లు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.