వ‌రుణ్ బాక్స‌ర్ లుక్ కిరాక్

Varun Tej celebrates his milestone

వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్ట్స్ డ్రామా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌రుణ్ బాక్సింగ్ ప్రాక్టీస్ కి ప్రిపేర‌వుతున్నాడు. జనవరి 19న వరుణ్‌ తేజ్‌ బర్త్‌డే సందర్బంగా టైటిల్‌ లోగోతో పాటు వరుణ్ తీక్ష‌ణ‌మైన ప్రాక్టీస్ లుక్‌తో ఓ పోస్టర్‌ను డిజైన్‌ చేసి రిలీజ్ చేశారు ఫ్యాన్స్‌. ఈ పోస్టర్‌లో బాక్సింగ్‌ సాధన చేస్తున్న వరుణ్‌ లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్‌ వస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్‌, సిద్ధు ముద్దాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే లుక్ మార్చిన వ‌రుణ్‌ బాక్సింగ్‌ ప్రాక్టిస్‌ చేయటంతో పాటు ఫిట్‌నెస్‌ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు వరుణ్‌ తేజ్‌.

ఈ సినిమా కోసం వరుణ్‌ ఎంత కష్టపడుతున్నాడో ఈ పోస్టర్ చూస్తేనే తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సింగ్‌లో మరింత నైపుణ్యం కోసం వరుణ్‌ ముంబై వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌ పర్యవేక్షణలో వరుణ్‌ బాక్సింగ్ శిక్ష‌ణ తీసుకుంటున్నారు.