థియేటర్లు లేకుండానే సినిమాలు విడుదల ?

శుక్రవారంనాడు ఆరు సినీమామాలు విడుదలవుతుండగా వీటికి థియేటర్లు లేకపోవడం విచారకరం. చిన్న సినిమాల పట్ల సినిమా పరిశ్రమ ఎంత నిర్లిప్తంగా ఉందొ దీనిని బట్టి అర్ధమవుతుంది. ఈ పరిస్థితి తెలంగాలోనే ఎక్కువ వుంది . ఆంధ్రాలో కొత్త పర్వాలేదు . విశేషమేమంటే ఈ సినిమాలు కనీసం రెండు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినవి కావడం విశేషం

“ఇష్టంగా” సినిమాకు హైద్రాబాద్లో సప్తగిరి థియేటర్ మాత్రమే లభించింది. తెలంగాణలో మరెక్కడా థియేటర్ లు లేవు. “మంచు కురిసే వేళలో” సినిమాకు రెండు థియేటర్స్ మాత్రేమే దొరికాయి. “మై డియర్ మార్తాండ్” సినిమాకు కేవలం 3 థియేటర్లు .తెలంగాణ ఇతర జిల్లాల్లో .4 థియేటర్లు లభించాయి.

“.యూ” అనే సినిమాకు హైద్రాబాద్లో 3 థియేటర్లు జిల్లాల్లో..4 థియేటర్లు అతి కష్టం మీద దొరికాయి “ఇదంజగత్” అనే సినిమాకు ..5 థియేటర్లు  మాత్రమే  లభించాయి. “బ్లఫ్ మాస్టర్” సినిమాకు  థియేటర్లు  ఇంత వరకు లభించలేదు ..శని వారం నుండి ఇచ్చే అవకావం ఉందని అంటున్నారు

ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాలకు పెట్టిన పెట్టుబడి మాట దేవుడెరుగు కనీసం పబ్లిసిటీ ఖర్చులైనా వస్తాయా ? సినిమా పరిశ్రమ ను కాపాడతాము అని ప్రభుత్వం, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పే పెద్దలు కానీ ఈ బడుగు నిర్మాతల గురించి పట్టించుకోరా ?