ఇండస్ట్రీ మాట : “లైగర్” కి ఎలా లేదన్నా ఇంత స్థాయి నష్టం తప్పదా.?

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్  దేవరకొండ కెరీర్ లో ఫస్ట్ టైం దర్శకుడు పూరి జగన్నాథ్ తో చేసిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “లైగర్” సినిమా కోసం అందరికీ తెలిసిందే. ఒక యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేసిన ఈ చిత్రం రిలీజ్ అయ్యాక మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేసి తెలుగు బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ టాక్ ని సంతరించుకుంది.

దీనితో ఈ సినిమా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఓవర్సీస్ లో అసలు విజయ్ కెరీర్ లోనే కాకుండా టైర్ 2 హీరోస్ అందరిలో కూడా ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకొని రికార్డు సెట్ చేసాడు. మరి ఈ సినిమా అయితే భారీ మొత్తంలో 90 కోట్ల మేర వరల్డ్ వైడ్ బిజినెస్ చెయ్యగా..

ఈ సినిమా అయితే ఈ మొత్తంలో ఎలా లేదన్నా 50 కోట్లు నష్టాలు మిగిల్చడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక పైగా తెలుగులో అయితే డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను కి “ఆచార్య” తర్వాత మరో భారీ దెబ్బలా ఈ సినిమా నిలిచింది అని సినీ వర్గాల వారు అంటున్నారు.

దీనితో తనకి రెండు సినిమాలకి కలిపి ఎలా లేదన్నా 80 నుంచి 90 నష్టం తప్పలేదని అంటున్నారు. దీనితో అయితే ఈ ఏడాదికి ఎపిక్ డిజాస్టర్ చిత్రాల్లో లైగర్ కూడా ఒకటిగా నిలిచిపోయింది.