ఈ నగరానికి ఏమైంది 2: దర్శకుడు ఏమంటున్నడంటే?

పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ అన్ని వర్గాల ఆడియెన్స్ ను తన మేకింగ్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా దాదాపు 40కోట్ల వరకు కలెక్ట్ చేసి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఆ తరువాత దర్శకుడు తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా మంచి వసూళ్ళను అందుకుంది.

ENE కలెక్షన్స్ పై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా రెండు కోట్లతో తీస్తే 15కోట్లవరకు వచ్చిందని ఆ విషయాన్ని నిర్మాత సురేష్ బాబు ముందే పసిగట్టారని వివరించాడు. అయితే ఇటీవల కాలంలో ENE యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఆ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు అనే రూమర్స్ గట్టిగానే వచ్చాయి.

అయితే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఫైనల్ గా తన నెక్స్ట్ సినిమా విషయంలో అయితే ఒక క్లారిటీ ఇచ్చాడు. నిజంగా ఎక్కడికి వెల్లినా కూడా ఈ నగరానికి ఏమైంది 2 ఎప్పుడు వస్తుందని అంటున్నారు. కానీ ప్రస్తుతం నేను ఒక డిఫరెంట్ స్టోరీ అనుకుంటున్నాను. వెంకటేష్ తో కూడా ఒక స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాల్సి ఉంది. వీలైతే ఆయనతోనే ఒక ఫ్యామిలీ కథ కూడా చేయాలని అనుకుంటున్నాను.. అంటూ తరుణ్ భాస్కర్ ఒక వివరణ ఇచ్చారు.

తరుణ్ భాస్కర్ చెప్పినధాన్ని బట్టి ఇప్పట్లో అయితే ఈ నగరానికి ఏమైంది 2 సీక్వెల్ లేదని ఒక క్లారిటీ అయితే వచ్చింది. కానీ తరుణ్ భవిష్యత్తులో మాత్రం ఆ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు మాత్రం క్లియర్ గా అర్ధమవుతోంది. ఆడియెన్స్ కూడా ఎక్కడికెళ్లినా అదే విషయాన్ని అడుతున్నట్లు తరుణ్ వివరణ ఇచ్చాడు. మరి ఆ కల్ట్ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందో చూడాలి.