Laila Movie: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా వేడుకలు వైఎస్ఆర్సిపి పార్టీని టార్గెట్ చేస్తూ కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే. మొదట్లో 150 గొర్రెలు ఉండేవని చివరికి వచ్చేసరికి 11 గొర్రెలే ఉన్నాయి అంటూ ఈయన వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడటంతో ఒక్కసారిగా వైసిపి అభిమానులు రంగంలోకి దిగి బాయి కాట్ లైలా మూవీ అనే ఒక హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు లక్షకు పైగా ట్వీట్లు రావడంతో చిత్ర బృందం స్పందిస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు మా సినిమాను చంపేయొద్దు ఆయన అలాంటి మాటలు మాట్లాడే సమయంలో మేము అక్కడ లేము అంటూ వివరణ ఇచ్చుకున్నారు.
ఇక తను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబితే మీ ఆవేశం, కోపం తగ్గుతుంది అంటే దయచేసి క్షమించండి అంటూ హీరో విశ్వక్ క్షమాపణలు కూడా చెప్పారు. ఈ క్రమంలోనే మరి కొంతమంది వైసిపి నేతలు మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ తమదైన శైలిలోనే కౌంటర్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు ఉన్నటువంటి ఆ 11 గొర్రెలు రేపు గర్జించే సింహాలుగా మారుతాయి. శత్రువులను చీల్చి చెండాడుతాయి. రోజులెప్పుడు ఒకేలా ఉండవు. వ్యక్తిగత కక్షలతో ఇండస్ట్రీని బలి చేయడమేంటి?” అంటూ ప్రశ్నించారు. ఆయన, రాజకీయ వేదికల్ని వదిలి సినీ ఈవెంట్లలో రాజకీయ విమర్శలు చేయడం సరైన అంశం కాదు అంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్ తనదైన శైలిలోనే పృథ్వీరాజ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాని బాయికాట్ చేయాలని వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే HDప్రింట్ బయటకు వస్తుంది అంటూ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో హీరో విశ్వక్ ఎంతో ఎమోషనల్ అవుతూ మా సినిమాని చంపేయొద్దు అంటూ అందరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు.