ENE2: ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్ అనౌన్స్.. నెట్టింట వీడియో వైరల్!

ENE2: దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈ నగరానికి ఏమైంది. ఈ సినిమా యూత్లో కరెక్ట్ క్లాసిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యువతను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఇందులో విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటమ్, వెంకటేష్ కకుమాను లీడ్ రోల్స్‌ లో న‌టించిన విషయం తెలిసిందే. 2018లో విడుదల అయిన ఈ చిత్రం ఘ‌న విజ‌యాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే గతంలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు తప్పకుండా సీక్వెల్ ఉంటుంది అని ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆ సీక్వెల్ ఎప్పుడు ఉంటుంది అన్న విషయం మాత్రం చెప్పలేదు. తాజాగా ఇదే విషయం గురించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. టీమ్ కన్యా రాశి వ‌చ్చేసింది అంటూ ఓ వీడియోను విడుద‌ల చేసింది చిత్ర బృందం.

దాదాపుగా అదే టీమ్‌తో ENE2 రూపుదిద్దుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడ‌క్ష‌న్ నిర్మిస్తోంది. అయితే సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు కానుంది షెడ్యూల్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి అన్న విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు. పార్ట్ 2 కోసం అభిమానులు కూడా సొంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయం గురించి వీలైనంత తొందరలో మరిన్ని అప్డేట్లు విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనౌన్స్మెంట్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.