నాయ‌కుల‌కు ఇప్పుడే ర‌క్త‌దానం గుర్తొచ్చిందా?

                                   కేటీఆర్ జన్మదినం.. త‌ల‌సాని బ్లడ్ క్యాంప్

క‌రోనా క‌ల్లోలంలో ప‌డి ప్ర‌జ‌లు ర‌క్త‌దానం మ‌ర్చిపోయార‌ని మెగాస్టార్ చిరంజీవి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దానివ‌ల్ల త‌ల‌సేమియా అనే ర‌క్త‌హీన‌త రోగులు మ‌ర‌ణిస్తున్నార‌ని.. యాక్సిడెంట్ల‌కు గురైన వాళ్లకు ర‌క్తం అంద‌క ప్రాణాపాయం త‌లెత్తుతోంద‌ని వీడియో ముఖంగా వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత తాను త‌న కుటుంబీకులు ర‌క్త‌దానం చేస్తున్న ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి. అనంత‌రం ప‌లువురు సెల‌బ్రిటీలు చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో ర‌క్త‌దానం చేశారు.

ఇదే స్ఫూర్తితో ప్ర‌జ‌లు ర‌క్త‌దానానికి ముందుకు రావాల‌ని సందేశం ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. ఇక తెలంగాణ ప్ర‌భుత్వంలో దీనిపై క‌ద‌లిక ఉన్నా లేక‌పోయినా కానీ.. నేడు ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, ఐటీ మంత్రి కేటీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

హైదరాబాద్ యూసఫ్ గూడ‌లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం లో జూలై 24 ఈ రోజు ఉదయం 9 గంటలకు బ్లడ్ క్యాంప్ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతులమీదుగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటుగా ఈ కార్యక్రమం నిర్వహించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ర‌క్త‌దానం.. నేత్ర‌దానం .. ఇంకేదైనా దానం ఇలాంట‌ప్పుడు అయినా రాజ‌కీయ నాయ‌కుల‌కు గుర్తు వ‌స్తున్నందుకు సంతోషించాల్సిందే.