తెలంగాణ రాష్ర్టంలో అధికార-ప్రతిపక్షాల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం ముదురుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకపోయేసరికి కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి కట్టుగా దాడి చేసాయి. రాష్ర్టంలో పరిస్థితుల్ని ఎండగడుతూ టీఆర్ ఎస్ నేతల్ని దుయ్యబెట్టారు. ఇక ఉస్మానియా ఆసుపత్రిలో భారీగా వర్షం నీరు వరదలా పాడంతో ప్రభుత్వ పెద్దలపై ప్రజల నుంచే వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో కాంగ్రెస్-బీజేపీ ఇంకా హద్దు మీరింది. ప్రతిపక్షాల దాడికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతి దాడి చేసే ప్రయత్నం చేసారు. హద్దు మీరితే తాము హద్దు మీరతామని..మీకే కాదు నోళ్లు మాకు ఉన్నాయంటూ తలసాని హెచ్చరించే ప్రయత్నం చేసారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, సీఎల్పీ నాయకుడు భట్టివిక్రమార్క తలసానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తలసానికి తల తోక తెలియదన్నారు. ఏం మాట్లాడుతున్నారో? ఆయనకే అర్ధం కాదు. నోరు ఉందని మీద పడిపోవడం తప్ప మరో విషయం తెలియద న్నారు. రోషయ్య సీఎంగా ఉన్నప్పుడే ఉస్మానియా పక్కన భవన నిర్మాణం కోసం200 కోట్లు కేటాయించారు. అప్పుడు ఉస్మానియాని కొనసాగించాలని తాము అన్నామని, అప్పుడే కొత్త భవనం కడతామని టీఆర్ సెస్ ఎస్ అధికారంలోకి వచ్చినప్పటుడు అప్పటి ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారని గుర్తు చేసారు. కానీ ఇప్పటివరకూ పనులు మొదలు పెట్టలేదన్నారు.
ఈ విషయాలు ఏవీ తెలియకుండా తలసాని మాట్లాడుతున్నారన్నారు. సిగ్గుండాలి. నీ శాఖలో ఏముందో పూర్తిగా నీకే తెలియదు. ఆరోగ్య శాఖ నీకెందుకు? అని ప్రశ్నించారు. గాడిద పెత్తనం కుక్క ఎత్తుకుంటే నడుములు విరిగాయి అన్నట్లు ఉంది నీ పద్దతి అంటూ ఎద్దేవా చేసారు. ఉస్మానియాలోకి నీళ్లు ఎలా వచ్చాయో ? చూడాల్సిన బాధ్యత మున్సీపల్ శాఖది..కానీ ఆశాఖ మంత్రి కేటీఆర్ ఎక్కడా కనిపించలేదని మండిపడ్డారు.