60 ఏజ్ హీరోలు.. షూటింగులు ఎలా చేస్తారు?

tollywood

క‌రోనా నియ‌మ నిబంధ‌న‌ల్ని పాటిస్తూ షూటింగులు చేసుకోవ‌చ్చ‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతా బాగానే ఉంది కానీ ఒకే ఒక్క మ‌త‌ల‌బు మాత్రం చాలా ఇబ్బందిక‌రంగా మారింది. 60 ప్ల‌స్ ఏజ్ హీరోలు.. అలాగే చిన్నారులు ఆన్ లొకేష‌న్ క‌నిపించ‌కూడ‌ద‌న్న నియ‌మం పెద్ద ప్రాబ్లెమాటిగ్గానే క‌నిపిస్తోంది.

ఆ కోణంలో చూస్తే ఇప్ప‌టికే వెట‌ర‌న్ హీరోలంతా 60 ఏజ్ కి ద‌గ్గ‌ర‌ప‌డిన వారే. చిరంజీవి 60 క్రాస్డ్. నాగార్జున‌కు 60. ఈ ఏడాదితోనే బాల‌కృష్ణకు 60. వెంకీ వ‌చ్చే ఏడాదికి 60లో అడుగు పెడుతున్నాడు. అంటే వీళ్లంతా ష‌ష్ఠిపూర్తి హీరోలేన‌న్న‌మాట‌. మ‌రి వీళ్లు కొవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం షూటింగులు చేయ‌కూడ‌దు క‌దా? మ‌రి వీళ్ల‌కు మిన‌హాయింపులు ఇస్తారా? ఒక‌వేళ మ‌హ‌మ్మారీ స‌ద‌రు హీరోల్ని వెంటాడితే ప‌రిస్థితేమిటి? ఆ త‌ప్పిదాన్ని ప్ర‌భుత్వాల‌పైకే నెట్టేస్తారా? ఇలా ఎన్నో సందేహాలున్నాయి ఫ్యాన్స్ కు.

షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతులిచ్చారు. మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికిప్పుడు సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతా బాగానే ఉంది కానీ ప‌రిమిత సిబ్బంధి ఒక‌రినొక‌రు ట‌చ్ చేయ‌కుండా ప‌ని చేయ‌డం అనేది ఆన్ సెట్స్ కుదిరేప‌నేనా? పైగా ముస‌లాళ్లు.. పిల్ల‌లు సెట్స్ కెళ్ల‌కూడ‌దు అంటే కుదిరే ప‌నేనా? అంటే అసాధ్యం అనే వాళ్లే ఎక్కువ‌. మ‌రి షూటింగులు ఎంత నియ‌మ‌నిబ‌ద్ధ‌త‌ల‌తో చేస్తారో చూడాలి. ఇక సీనియ‌ర్ హీరోలు ప్ర‌తిచోటా ఇన్వాల్వ్ అయ్యి ప‌ని చేసే ప‌రిశ్ర‌మ‌లో రూల్స్ ఏమేర‌కు పాటిస్తారు? అన్న‌దే స‌స్పెన్స్ గా మారింది.