మంత్రి త‌ల‌సాని త‌న‌యుడు ఇంకా చిన్న‌పిల్లగాడేనంట‌

తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కుమారుడు సాయి కిర‌ణ్ ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వూలో గోదావ‌రి న‌దీ ప్ర‌వాహం గురించి మాట్లాడి ట్రోల్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్ నేత‌లు సాయి కిర‌ణ్ వ్యాఖ్య‌ల‌పై జోకులే వైసారు. మ‌హ‌రాష్ర్ట‌లో పుట్టిన గోదావ‌రి న‌ది ముందుగా ఏపీ మీదుగా ప్ర‌వ‌హించి ఆ త‌ర్వాత తెలంగాణ‌లోకి ఎంట‌ర్ అవుతుంద‌ని ఓ ఇంట‌ర్వూలో నోరు జారి అబాసుపాలయ్యాడు. త‌ర్వాత అదే ఇంట‌ర్వ్యూయ‌ర్ కాదండి గోదావ‌రి ముందు తెలంగాణ‌లో కి ప్ర‌వ‌హిస్తుంది…ఆ త‌ర్వాత ఏపీలోకి ఎంట‌ర్ అవుతుందని ఎంత చెప్పినా వినిపించుకోకుండా త‌న మానాన తాను చెబుతూనే ఉన్నాడు. చివ‌రికి పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ సాయి కిర‌ణ్ ఆ త‌ప్పిదాన్ని క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేసాడు.

ఆ మాత్రం జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ లేని మంత్రిగారి అబ్బాయి తండ్రి వార‌త‌సత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజ‌కీయాలు చేస్తార‌ని, తండ్రిలాగే మంత్రి కూడా అవుతార‌ని, అందుకు టీఆర్ ఎస్ పార్టీ పెద్ద పీఠ వేస్తుంద‌ని ప్ర‌తిప‌క్షం స‌హా సోష‌ల్ మీడియా జ‌నం జోకులు, సైటెర్లే వేసారు. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ ఓ కార్య‌క్ర‌మంలో త‌న‌యుడు త‌ప్పిదాన్ని ఏమ‌ని క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసారు. సాయి కిర‌ణ్ ఇంకా చిన్న పిల్లగాడేనంటే. చిన్న పిల్లోడిని ప‌ట్టుకుని పెద్ద పెద్ద ప్ర‌శ్న‌లు వేస్తే ఎలా? గోదావ‌రి, కృష్ణా న‌దుల గురించి ఏదో తెలియ‌క నోరు జారి ఉంటాడు. అయినా ఇప్పుడున్న రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎంత నాలెడ్జ్ ఉందో అందిరికీ తెలుసు.

ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల్ని చ‌ర్చా వేదిక‌కు పిలిచి నాలెడ్జ్ పై డిబేట్ పెట్టుకుంటే ఎవ‌రి నాలెడ్జ్ ఎంత అన్న‌ది తెలుస్తుంది. రాజ‌కీయాలు చేయ‌డానికి నాలెడ్జ్ అవ‌స‌రం లేదు. మూడు, నాలుగు ద‌శాబ్ధాలుగా రాజ‌కీయంలో ఉన్న‌వారికే ఏ శాఖ‌లో ఏముందో తెలియ‌ని నాయ‌కులు చాలా మంది ఉన్నార‌ని ప్ర‌తిప‌క్షాల‌ను ఉద్దేశించి ఎద్దేవా చేసారు. రాజ‌కీయాలు చేయ‌డానికి…జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ కి సంబంధం లేద‌న్నారు త‌ల‌సాని. సాయి కిర‌ణ్ పొర‌పాటున నోరు జారిన అంశాన్ని ప‌ట్టుకుని ప్ర‌తిప‌క్షం యాగీ చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు.