నిఖిల్ కెరీర్‌కి సెట్ బ్యాక్ ?

అర్జున్ సుర‌వ‌రం ఇంకా సందిగ్ధ‌మేనా?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరోల్లో నిఖిల్ పేరు టాప్ 5లో ఉంటుంది. నితిన్ .. రామ్.. వీళ్ల త‌ర్వాత వేగంగా పాపుల‌రైన హీరో. హ్యాపీడేస్ చిత్రంతో కెరీర్ ప్రారంభించినా సోలో హీరోగా త‌న‌ని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవ‌డంలో నిఖిల్ హార్డ్ వ‌ర్క్ కి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. స్వామిరారా.. కార్తికేయ‌.. సూర్య వ‌ర్సెస్ సూర్య‌.. ఎక్కడికి పోతావు చిన్న‌వాడా.. కేశ‌వ ఈ చిత్రాల‌న్నీ ఘ‌న‌విజ‌యం సాధించిన‌వే. అందుకే నిఖిల్ రైజింగ్ ని ఎవ‌రూ ఆప‌లేర‌న్న ముచ్చ‌టా సాగింది. అయితే ఇంత‌లోనే అత‌డు ఊహించ‌ని ఇబ్బందుల్లో ప‌డ్డాడ‌నే అర్థ‌మ‌వుతోంది.

నిఖిల్ న‌టించిన `అర్జున్ సుర‌వ‌రం` రిలీజ్ సందిగ్ధ‌త అభిమానుల్లో నిరంత‌రం హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికే ఈ సినిమాకి మూడు నాలుగు సార్లు రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించి వాయిదా వేశారు. చివ‌రి నిమిషంలో వాయిదా వేయ‌డం నిఖిల్ ని ఎంతో ఎమోష‌న్ కి గురి చేసింది. టైటిల్ మార్పు సినిమాకి డ్రా బ్యాక్. ఆ త‌ర్వాతా ఎందుక‌నో ఈ సినిమాకి స‌రిగా క‌లిసి రావ‌డం లేద‌న్న చర్చ సాగింది. ఇప్ప‌టికీ టీమ్ డైల‌మాలోనే ఉండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ప్ర‌భాస్ న‌టించిన భారీ చిత్రం `సాహో` వాయిదా అన‌గానే నిఖిల్ నుంచి ఏదో ఒక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అంతా భావించారు. కానీ ఎందుక‌నో ఇప్ప‌టివ‌ర‌కూ `అర్జున్ సుర‌వ‌రం` టీమ్ నుంచి చ‌డీ చ‌ప్పుడు లేనేలేదు. ఇన్ సైడ్ ఇంకేదో జ‌రుగుతోంది. ఆర్థిక‌ప‌ర‌మైన ఇబ్బందులు ఉన్నాయ‌ని… సీన్లు మారుస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆగ‌స్టులో క‌ష్ట‌మే.. సెప్టెంబ‌ర్ లోనే ఛాన్స్ ఉంటుంద‌న్న ముచ్చ‌టా సాగుతోంది. ఇప్ప‌టికే ఆగ‌స్టు 15న ఎవ‌రు.. ర‌ణ‌రంగం చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఆగ‌స్టు 30 సాహో లాంటి భారీ చిత్రం రిలీజ‌వుతోంది.

ఆ క్ర‌మంలోనే నిఖిల్ అర్జున్ సుర‌వ‌రం రిలీజ్ ఈ నెల‌లో ఉంటుందా ఉండ‌దా? అన్న ముచ్చ‌టా సాగుతోంది. ముద్ర టైటిల్ తో మార్చి 29న రిలీజ్ కావాల్సిన‌ది. ఇప్ప‌టికే జూలై ముగుస్తోంది. ఇంకా ఎందుకీ సందిగ్ధ‌త అన్న‌ది తేలాల్సి ఉంది. త‌మిళ సూప‌ర్ హిట్ క‌నిథాన్ కి రీమేక్ గా తెర‌కెక్కిన ఈ సినిమాపై నిఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఏదేమైనా రైజింగ్ లో ఉన్న ఈ టైమ్ లో నిఖిల్ కి ఇదో పెద్ద డ్రాబ్యాక్ అని అభిమానులు భావిస్తున్నారు. మ‌రి ఈ సందిగ్ధ‌త‌ల నుంచి బ‌య‌ట‌ప‌డి నిఖిల్ ఎలాంటి క్లారిటీనిస్తారో చూడాలి.