ఫ్లాఫ్ ల్లో మునిగి తేలుతున్న ముగ్గురూ కలిసారు

సాధారణంగా క్రేజీ కాంబినేషన్ లో సినిమాలు చేయటానికి దర్శక,నిర్మాతలు ఉత్సాహం చూపిస్తూంటారు. అయితే ఒక్కోసారి మనం క్రేజీ అనుకున్నవి ఎదుటివారికి లేజీగా అనిపిస్తూంటాయి. ఇప్పుడు సందీప్ కిషన్ తాజా చిత్రం గురించి ఇలాంటి కామెంట్సే వినిపిస్తున్నాయి. యంగ్ హీరో సందీప్ కిష‌న్ తాజాగా తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ టైటిల్ తో ఓ కామెడీ చిత్రం కమిటయ్యారు. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు.

డిసెంబ‌ర్ 4న అంటే ఈ రోజున నాగేశ్వరరెడ్డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ సినిమాను ప్ర‌క‌టించారు. హ‌న్సిక ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. సందీప్ కిష‌న్ తో ఈమె న‌టించబోయే తొలి సినిమా ఇదే. ఇక అసలు విషయంలోకి వస్తే సందీప్ కిషన్ కు గత కొంతకాలంగా హిట్ అనేది లేనేలేదు. హన్సిక పరిస్దితి కూడా సేమ్ టు సేమ్. ఇక దర్శకుడు నాగేశ్వరరెడ్డి కూడా రీసెంట్ గా ఆచారి అమెరికా యాత్ర అంటూ డిజాస్టర్ ఇచ్చారు. ఇలా వీళ్లు ముగ్గురు కలిసి ఓ హిట్ కు శ్రీకారం చుట్టబోతున్నట్లు చెప్తున్నారు. ఏమో ..వీళ్ల ముగ్గురూ కలిసి ఓ బ్లాక్ బస్టర్ ఇస్తారని అభిమానులు ఆశించటంలో తప్పేమి లేదు. అయితే ట్రేడ్ వర్గాలు కూడా అలా ఆలోచిస్తే బిజినెస్ కూడా చక్కగా సాగుతుంది.

వెన్నెల కిషోర్, ముర‌ళి శ‌ర్మ, పృథ్వీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. డిసెంబ‌ర్ 14న ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది.. అదే రోజు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లు కానుంది.

న‌టీన‌టులు:
సందీప్ కిష‌న్, హ‌న్సిక‌, ముర‌ళి శ‌ర్మ‌, వెన్నెల కిషోర్, పృథ్వీ త‌దిత‌రులు
టెక్నిక‌ల్ టీం:
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: జి నాగేశ్వ‌ర‌రెడ్డి
నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి
నిర్మాణ సంస్థ‌: ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్
కో ప్రొడ్యూస‌ర్: జ‌గ‌దీష్
క‌థ‌: రాజ‌సింహ
సంగీతం: శేఖ‌ర్ చంద్ర
సినిమాటోగ్ర‌ఫీ: శ‌్యామ్ కే నాయుడు
మాట‌లు: నివాస్, భ‌వానీ ప్ర‌సాద్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్