షాకింగ్: శ్రీరెడ్డికి సడన్ గా ఏమైంది??

సంచలన నటి శ్రీరెడ్డి ఏం మాట్లాడినా సంచలనంగానే ఉంటుంది. యాంకరింగ్, నటనలో రాని గుర్తింపు ఆమెకు కాస్టింగ్ కౌచ్ అంశం తెరపైకి తేవడం, ఫేసుబుక్లో వివాదాస్పద పోస్టులు పెట్టడం వలనే వచ్చింది. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి అక్కడ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక సినిమాలో నటించబోతున్నట్టు ప్రకటన కూడా చేసింది. ఒక తమిళ నటి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న రెడ్డి డైరీ అనే బయోపిక్ లో శ్రీ రెడ్డి పోలీసు అధికారిణిగా కనిపించనుందట.

కాగా చెన్నై వెళ్లిన శ్రీరెడ్డికి జ్ఞానోదయం అయినట్టుంది. తన పోస్టుల్లో హితబోధలు చేస్తోంది ఈమధ్య. “మీ భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించండి. వాళ్ళు ఎప్పుడూ తప్పు మార్గాన్ని చూపించరు. ప్రపంచంలో వాళ్ళకంటే మంచి టీచర్లు, హితవు కోరేవారు ఉండరు. నాకు ఈ విషయం తెలిసొచ్చేసరికి నా జీవితం, కుటుంబం చేజారిపోయింది. నా ఫ్యామిలీ ఏడుపుని పట్టించుకోలేదు. ఇప్పుడు నేనే రోజూ ఏడుస్తున్నాను. అందుకే తల్లిదండ్రుల్ని గౌరవించండి. వాళ్ళని ప్రేమించండి, దూరం చేసుకోకండి”. అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

ఎప్పుడూ వివాదాస్పద పోస్టులుపెట్టి రచ్చ చేసే శ్రీరెడ్డి నీతి వాక్యాలు చెప్తుంది ఏంటి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీరెడ్డిలో ఈ సడన్ చేంజ్ కి కారణం ఏమై ఉంటుంది అని తెగ చర్చించుకుంటున్నారు. ఫస్ట్ టైం నువ్వు ఇలా పోస్ట్ చేయడం చూస్తున్నాం. గుడ్, నీ మాటలతో మేము కూడా అంగీకరిస్తున్నాం అని కొందరు మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం ఇప్పటికైనా బుద్ధొచ్చిందా? చేసిన తప్పేంటో తెలిసొచ్చిందా? తల్లిదండ్రులు ఇప్పుడు గుర్తొచ్చారా? ఇకనైనా మంచిగా ఉండు అంటూ చీవాట్లు పెడుతున్నారు శ్రీరెడ్డికి.