ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతూ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన “షోయింగ్ బిజినెస్”అనే పేరు తో నిర్మాణ సంస్థ స్థాపించారు. తొలిసారి కార్తికేయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం `ఆకాశవాణి`. రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం థీమ్ పోస్టర్ ని విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం గురించి మరో అప్ డేట్ బయిటకు వచ్చింది.
తొలిసారి నిర్మాతగా చేస్తున్న కార్తికేయ తన బడ్జెట్ ని రూ.4 కోట్లకు మించి ఒక్క రూపాయి పెరగకూడదని దర్శకుడుకి స్ట్రిక్ట్ గా చెప్పారట. అలాగే షెడ్యూల్స్ ప్లానింగ్ కూడా తప్పకూడదని చెప్పారట. అలాగే సినిమా మార్కెటింగ్, పబ్లిసిటీ కూడా ముందే ప్రీ ప్లాన్డ్ గా ఉండాలని క్లియర్ గా చెప్పారట. కార్తికేయ ఆలోచన ఏమిటంటే…రిలీజ్ కు ముందే… టేబుల్ ప్రాఫిట్‌తో సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోవాలి. అందుకోసం కసరత్తు చేస్తున్నార్ట.
కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. కాలభైరవ మంచి సింగర్ .. ‘బాహుబలి 2’లో ‘దండాలయ్యా ..’.. ఇటీవల వచ్చిన ‘అరవింద సమేత’లో ‘పెనిమిటీ ..’ పాటలను ఆయనే ఆలపించాడు. బాగా పాప్యులర్ అయిన ఈ పాటలు ఆయనకి మంచి పేరును తీసుకొచ్చాయి. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా, సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం అవుతుంది. త్వరలోనే మిగతా నటీనటుల వివరాలను ప్రకటిస్తారు.
ఈ చిత్రానికి సౌండ్ డిజైన్: రఘునాథ్.కె, కాస్ట్యూమ్స్: సంజనా శ్రీనివాస్, కాస్టింగ్ డైరెక్టర్: మహతి బిక్షు, ప్రొడక్షన్ డిజైనర్: మోహన్ నాథ్ ఎస్.బింగి, లైన్ ప్రొడ్యూసర్: శశాంక్, స్క్రీన్ ప్లే: అశ్విన్ గంగరాజు, సందీప్ రాజ్, సాయికుమార్ రెడ్డి, నిర్మాత: ఎస్.ఎస్.కార్తికేయ, దర్శకత్వం: అశ్విన్ గంగరాజు.