మణుగూరు ఎస్సైపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

వివాహేతర సంబంధంపై నిలదీసినందుకు ఒక ఎస్సై తన భార్య, అత్తపై పాశవికంగా దాడి చేసిన ఘటన నిర్ఘాంతపోయేలా చేసింది. మణుగూరు ఎస్సై జితేందర్ ఫర్వీన్ ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెని తరచూ వేధిస్తుండటంతో పుట్టింటికి వెళ్ళిపోయింది.

గురువారం తన తల్లితో కలిసి మహిళా సంఘాలను వెంటబెట్టుకుని జితేందర్ ఇంటికి వచ్చింది ఫర్వీన్. ఆగ్రహం చెందిన ఎస్సై ఫర్వీన్ ని, ఆమె తల్లిని విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో ఫర్వీన్ తల్లి స్పృహ తప్పి పడిపోయింది. ఫర్వీన్ కి రక్తం వచ్చేంత గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై నటి శ్రీరెడ్డి స్పందించింది. మణుగూరు ఎస్సైపై సంచలన పోస్టు కూడా పెట్టింది. కింద ఆ పోస్టు వివరాలు చదవవచ్చు.

మణుగూరు ఎస్సై జితేందర్ కి యావజ్జీవ కారాగార శిక్ష వేయాల్సిందిగా కోరుకుంటున్నా.. సాటి మనిషి అందులోనూ ఆడదానిపై పశువు లాగా పడి దాడి చేస్తాడా?? ఆడవాళ్ళని అలుసా?? ముగ్గురు లేడీస్ ని కొట్టిన విధానం చూస్తుంటే, క్రూయల్ మెంటాలిటీ అని అర్ధం అవుతుంది. పోలీస్ శాఖలో పనిచేయడానికి అర్హుడు కాదు. ఇమీడియట్లి పోలీస్ శాఖ కఠిన చర్యలు తీస్కోండి. ఇలాంటి వాడిని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి “____(బూతు)” కట్ చేసేయండి. అంటూ తన స్టైల్ లో సంచలనాత్మక పోస్టు పెట్టింది. కింద ఆ పోస్టు ఉంది చూడండి.