“అందుకు కారణం త్రిష”. చెన్నైలో శ్రీరెడ్డి షాకింగ్ రిప్లై

తెలుగు మీడియాలో శ్రీరెడ్డిపై ఫోకస్ తగ్గిపోయింది. తను ఒకటి రెండు ఫేస్బుక్ పోస్టులు పెడుతున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. బిగ్ బాస్ 2 సీజన్ కావడంతో ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా అంతా ఎలిమినేట్ అయిన వారి నుండి హౌస్ విషయాలు రాబట్టి రేటింగ్ పెంచుకునే పనిలో పడిపోయాయి. బిగ్ బాస్ 2 అయేవరకు తనని ఎవరూ పట్టించుకోరు అనుకుందేమో. తమిళ్ లీక్స్ మొదలెట్టి చెన్నై వెళ్ళిపోయింది శ్రీరెడ్డి. ప్రస్తుతం అక్కడి మీడియాలో హడావిడి చేస్తుంది. ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్పటిలానే తన స్టైల్ లో సమాధానాలు చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలోకి రావటానికి స్ఫూర్తి ఎవరు అని ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు త్రిష అని సమాధానం ఇచ్చింది. అది కూడా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వలనే అంట. ‘నేను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కలిసి పబ్ కి వెళ్ళాము. అదే పబ్ లో రానా, త్రిష డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. త్రిషని చూసిన నా ప్రియుడు చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు. త్రిష చాలా బాగుంది కదా.. ఎంత క్యూట్ గా ఉందో అని నా ముందే పొగుడుతున్నాడు. అలా త్రిషని పొగుడుతుంటే నాకు కుళ్ళుగా అనిపించింది. అదే నేను కూడా హీరోయిన్ అయితే అబ్బాయిలంతా నన్ను కూడా చూసి ఇలానే మాట్లాడుకుంటారేమో అనిపించింది. ఇంక హీరోయిన్ ఆవలి అనుకున్నాను. నన్ను నేనే అందుకు కావాల్సినట్టుగా బాడీని మౌల్డ్ చేసుకున్నాను. బట్ ఆఫర్లు కోసం ఆ తప్పుడు పనులు చేయాల్సొచ్చింది’ అని తెలియజేసింది శ్రీరెడ్డి. అయితే తెలుగు మీడియాలో ఎప్పుడు ఈ ప్రశ్న అడిగినా ఏవేవో సమాధానాలు చెప్పేది కానీ ఇలా ఎప్పుడూ చెప్పలేదు శ్రీరెడ్డి. చెన్నై మీడియాలో మాత్రం అందుకు కారణం త్రిష అని చెప్పటం కూసింత షాకింగ్ సమాధానమే.