సింగిల్ కాదు రిలేష‌న్‌షిప్‌లో ఉన్నా అని ఫోటో పెట్టిన శ్రీరెడ్డి

టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ వివాదంలో పలువురికి సంబంధించిన ఫోటోలు, వాట్సాప్ చాట్టింగులు బయట పెట్టి సంచలనం సృష్టించింది నటి శ్రీరెడ్డి. ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరాం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటూ అతనితో చనువుగా ఉన్న ఫోటోలు రివీల్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం చెన్నైలో కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం చేస్తూ అక్కడే సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది శ్రీరెడ్డి.

తాజాగా ఆమె తన ఖాతాలో సోలో అంటూ తన ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటొపైన సింగిల్ కాదు, స్వేచ్ఛతో రిలేషన్షిప్ లో ఉన్నా అని రాసి ఉంది. ఇప్పటివరకు ఆమె చాలామందితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్టు పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది. అయితే సినిమా అవకాశాల కోసమే తను ఆలా చేశానని వెల్లడించింది.

కాగా అభిరాంతో మాత్రం సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు తెలిపింది. పెళ్లి విషయం వచ్చేసరికి స్థాయి చూసి మాట్లాడమని అతడన్నాడని, మా ఫ్యామిలీలోకి కోడలిగా అడుగు పెట్టే అర్హత నీకు లేదంటూ అతను చేసిన వ్యాఖ్యలు తనని ఆలోచింపచేశాయని చెప్పింది. అప్పుడే అతని గురించి బయట పెట్టేయాలని, ఈ కాస్టింగ్ కౌచ్ గురించి కూడా పోరాడాలని తాను నిర్ణయం తీసుకున్నట్టు తమిళ ఇంటర్వ్యూల్లో కూడా తెలిపింది శ్రీరెడ్డి.