తిట్టిన నోటితోనే ఆ హీరోని పొగిడిన శ్రీరెడ్డి

 

శ్రీరెడ్డి ఒకోసారి ఏం మాట్లాడుతుందో అర్ధం కాదు. ఆమె పెట్టె పోస్టుల్లో కూడా డైరెక్ట్ గా మ్యాటర్ రివీల్ చేయదు. ఆమె తిట్టాలి అనుకున్న వ్యక్తుల పేర్లు ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తుంటుంది. అయితే ఈసారి శ్రీరెడ్డి ఒక హీరోని పొగిడింది. ఇందులో వింత ఏముంది అంటారేమో. గతంలో ఆ హీరోని కూడా చెడామడా ఆడేసుకుంది.

ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే శ్రీరెడ్డి హీరో విశాల్ గురించి ఒక పోస్టు పెట్టింది. విశాల్ గురించి పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ పేపర్ క్లిప్పింగ్ ని తన ఫేస్బుక్ టైంలైన్ లో పోస్ట్ చేసి “థాంక్యూ విశాల్ గారు. మీరు చాలా మంచి వ్యక్తి… కానీ కెమెరాస్?” అని పెట్టింది.

అయితే గతంలో పలుమార్లు శ్రీరెడ్డి విశాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాస్టింగ్ కౌచ్ అంశం వచ్చినపుడు విశాల్ నాని మంచివాడు. ఆమె ఆరోపణలు అవాస్తవం అని తెలిపాడు. అప్పుడు శ్రీరెడ్డి విశాల్ పై కోపం వ్యక్తం చేసింది. ఆ తర్వాత చెన్నై వెళ్లి కాస్టింగ్ కౌచ్ గురించి కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే విశాల్ స్పందించలేదని ఆరోపించింది. ఇప్పుడు విశాల్ గురించి ఇలా మాట్లాడటం వెనుక అర్ధం ఏమై ఉంటుందా అని అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.