Vishal: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు విశాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈయన సినిమాలకు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా విశాల్ ఒక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విశాల్ వేదిక పైకి వెళ్ళిన కాసేపటికి స్పృహ కోల్పోయి కింద పడిపోయారు..
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అయితే స్పృహ కోల్పోవడంతో వెంటనే విశాల్ ను సమీపంలోని హాస్పిటల్ కి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు అయితే ఆయనకు ఎలాంటి సమస్య లేదని వైద్యులు తెలియజేశారు. ఇక విశాల్ ఇలా కింద పడిపోవడం గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మేనేజర్ హరి స్పందించారు.
ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ విశాల్ మధ్యాహ్నం భోజనం చేయకుండా కేవలం జ్యూస్ మాత్రమే తాగారని భోజనం చేయకపోవడం వల్ల ఆయన స్పృహ కోల్పోయి పడిపోయారు. తప్ప ఎలాంటి సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చారు కానీ సోషల్ మీడియాలో మాత్రం విశాల్ ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. గత కొంతకాలంగా విశాల్ ఆరోగ్యం స్థిమితంగా లేదని ఈయన ఏదో భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
గత కొద్ది రోజుల క్రితం విశాల్ తన సినిమా వేడుక కోసం ఇతర మనుషుల సహాయంతో నడుస్తూ వేదిక పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈయన వేదికపై మాట్లాడుతున్న సమయంలో తన చేతులు మొత్తం వనకడం, మాట కూడా స్పష్టంగా రాకపోవడం జరిగింది. ఇలా విశాల్ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్లే ఈయన జబ్బులతో బాధపడుతున్నారని పలువురు తన ఆరోగ్యం పై కామెంట్లు చేస్తున్నారు.