సోనమ్ నిర్ణయం అభిమానులను కలవర పరుస్తుంది

అందం ,ఫ్యాషన్  అనగానే గుర్తుకొచ్చే బాలీవుడ్ భామల్లో సోనమ్ కపూర్ తప్పకుండా ఉంటుంది . అనిల్ కపూర్ వారసురాలిగా 2007లో సావరియా చిత్రంతో హీరోయిన్ అయిన సోనమ్  చాలా హాట్ , మరియు బోల్డ్ లేడీ అనే చెప్పాలి . ఆమె ధరించే దుస్తులు చూస్తే ఎవరికైనా మతి పోవలసిందే . 2017లో ఆమె నటించిన “నీరజ” సినిమా జాతీయ అవార్డు ను సంపాదించి పెట్టింది . ఈ 33 సంవత్సరాల  సుందరి   ఆనంద్  అహుజ అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. అయితే నిన్న ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె అభిమానులనే కా ప్రేక్షకులను కూడా నిరాశ పరిచింది .

ఎప్పుడు పార్టీలు, ఫంక్షన్లకు హాజరవుతూ ఆమె ధరించే డ్రెస్ ఎంత పిచ్చేక్కిస్తుందో ఎదురు చూసేవారు వున్నారు . ఉన్నది  ఉన్నట్టు మాట్లాడే సోనమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది . ముఖ్యంగా ట్విట్టర్లో ఆమె పోస్టుల కోసం ఎదురు చూసే అభిమానులు వున్నారు . అలాంటిది కొన్నాళ్ల పాటు ట్విట్టర్  జోలికి పోనని  పోస్ట్ చేసింది .  అయితే ట్విట్టర్ తనకు మనస్తాపాన్ని కలిగిస్తున్నదని ,అందుకే కొంత కాలం దాని జోలికి వెళ్లదలుసుకోలేదని చెప్పింది . తన అభిమానులు  శాంతితో , ప్రేమతో జీవించాలని తానూ కోరుతుంటున్నానని చెప్పింది . ఇంతకు మించి మరో కారణం చెప్పలేదు .

సోషల్  మీడియాలో యాక్టీవ్ గా వుండే సోనమ్ మనస్సు నొచ్చుకునేది  ఎదో జరిగి ఉంటుంది . ఇంతకు ముందు అంటే పెళ్లి కాలేదు కాబాట్టి ఎలాటి కామెంట్స్ చేసినా ఈజీగా తీసుకునేది . ఇప్పుడు పెళ్లి అయ్యింది . భర్త ఆనంద్ కు నచ్చనిది ట్విట్టర్ లో ఏదైనా కామెంట్ వచ్చిందా ? లేక మరేదైనా కారణం ఉందా ? అన్నది తెలియడం లేదు . ప్రస్తుతం సోనమ్ “ది జోయా ఫ్యాక్టరీ ” అనే చిత్రంలో నటిస్తుంది
.