పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం censor formalities పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ మంజూరవ్వగా, మొత్తం 2 గంటల 42 నిమిషాల 30 సెకన్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూలై 24న ఈ చిత్రం ఐదు భాషల్లో గ్లోబల్ గా విడుదల కానుంది.
క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించిన ఈ విభిన్న యాక్షన్ పీరియాడికల్ డ్రామాలో పవన్ కల్యాణ్ ఒక పోరాట యోధుడి పాత్రలో కనిపించబోతున్నారు. పవన్ అభిమానుల్లో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ స్థాయి అంచనాలు ఏర్పడటం విశేషం. ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, సునీల్, నాజర్, బాబి డియోల్ వంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు.
సెన్సార్ ప్రక్రియ పూర్తయిన వెంటనే విడుదల ఏర్పాట్లకు జోరు పెరుగుతూ, జూలై 20న ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. విశాఖపట్నం సముద్ర తీరాన్ని ఈ భారీ ఈవెంట్ వేదికగా మార్చి, అభిమానులు వేలాదిగా చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేసే అవకాశం ఉందని సమాచారం. పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ స్నేహం, రాజమౌళి అన్నగా గౌరవించే కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించడం, వీరిద్దరూ వేదికపై పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఉండేలా చేసిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడం, పవన్ పోరాట యోధుడి అవతారం, స్టార్ డైరెక్టర్లు వేదికపై ఉండడం, విశాఖపట్నం తీరంలో అభిమానుల సందడి ఇవన్నీ కలిపి హరిహర వీరమల్లు వేడి మరింత పెంచుతున్నాయి.
