రామ్ చరణ్ మాటలకు పెడ అర్దాలు తీస్తూ…

” మనిషికన్నా గొప్పది వాళ్ల ఆలోచన. అలాంటి గ్రేట్‌ ఆలోచన ఉన్న వ్యక్తి ఎప్పటికీ దిగజారడు.. ఉన్నత స్థాయిలో ఉంటాడు. అది సినిమా ఇండస్ట్రీ అయినా, రాజకీయాలైనా. గ్రేట్‌ ఆలోచనలు ఉన్న మన డైరెక్టర్స్‌లో రాజమౌళిగారు, సుకుమార్‌గారు, క్రిష్‌గారు కావొచ్చు.. వీరికన్నా గొప్ప స్థాయికి సంకల్ప్‌ రావాలని కోరుతున్నా” అంటూ ఎమోషనల్ గా రామ్ చరణ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ లుగా మారాయి.

వరుణ్‌ తేజ్‌ హీరోగా, లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్‌’. క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ముఖ్య అతిథి రామ్‌చర ణ్‌ మాట్లాడుతూ పై విధంగా అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసాయి. వాటికి పెడ అర్దాలు తీస్తూ జనం కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ చరణ్ కాస్తంత ప్రోత్సాహంగా ఉంటుందని పాజిటివ్ గా ఇలా చెప్పినా జనం నెగిటివ్ గా తీసుకుంటున్నారు. వేరే డైరక్టర్స్ ఇండస్ట్రీలో లేరా, సుకుమార్, రాజమౌళి, క్రిష్ మాత్రమే గ్రేట్ ఆలోచనలు ఉన్నవారా అంటున్నారు. అంటే తను ఇప్పటిదాగా పనిచేసిన ఇద్దరితో పాటు స్టేజిపైన ఉన్న క్రిష్ ని కూడా కలుపుకున్నాడని అంటున్నారు. తాను ఇప్పుడు చేస్తున్న డైరక్టర్ బోయపాటి శ్రీను ఆయనకు ఆనలేదా అని విమర్శిస్తున్నారు.

అయితే బోయపాటిని కలపటానికి విభిన్నమైన సినిమాలు చేసే వారిని దృష్టిలో పెట్టుకుని రామ్ చరణ్ అన్నాడు తప్ప..కమర్షియల్ గా హిట్స్ కొట్టేవారు లిస్ట్ చెప్పలేదని మరికొందరు రామ్ చరణ్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఏదైమైనా ప్రతీ చిన్నదానికి ఇలా వంకరగా రియాక్ట్ అవటం, లేనిపోని పెడర్దాలు తీయటం సోషల్ మీడియాలో ఎక్కువైపోయిందనేది మాత్రం నిజం.