శోభన్ బాబు ఆరోగ్య రహస్యం

అందాల నటుడు శోభన్ బాబు జయంతివేడుకను మూడు రోజుల క్రితం ఆయన అభిమానులు జరుపుకున్నారు.
శోభన్ బాబు పేరుతో అవార్డులు కూడా ప్రదానం చేశారు. అప్పుడే శోభన్ బాబు చనిపోయి 12 సంవత్సరాలు కావస్తుంది.
“పోయినోళ్ళు ఉన్నోళ్ల తీపి గురుతులు” అన్నారు ఆచార్య ఆత్రేయ. నిజమే పోయిన వారంతా ఉన్నవారి తీపి గురుతులే.
కాలం చాలా వేగంగా మారుతుంది. మనుషుల మధ్య ఒకప్పుడున్న అభిమానాలు, అనుబంధాలు, ఆత్మీయతలు క్రమంగా కనుమరుగవుతున్నాయి.

మనిషి సాంకేతిక ప్రభావానికి భానిషవుతున్నాడు. అది రేడియో కావచ్చు, టీవీ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు మొబైల్ ఫోన్ కావచ్చు, వీటికి ప్రభావాన్ని గురవుతున్నాడు. ఎక్కువ సమయం వీటికే కేటాయిస్తున్నారు. ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పు ఇది. ఇలాంటి స్థితిలో ఎప్పుడో చనిపోయిన ఓ అభిమాన కథానాయకుణ్ణి గుర్తు పెట్టుకోవడం నిజంగా అపురూపమే. శోభన్ బాబు నిజంగా అదృష్టవంతుడు. తెలుగు సినిమాలో “శోభా”యమానం గా వెలిగాడు .

విలక్షణ నటుడుగా , అందాల హీరోగా శోభన్ బాబు తెలుగు ప్రేక్షకుల మనసులు చెరిగిపోని ముద్ర వేశాడు జనవరి 14 1937లో కృష్ణా జిల్లా చిన్న నందిగామ లో జన్మించాడు. 1959లో ఎన్టీఆర్ హీరోగా నటించిన “దైవ బలం”తో సినిమా రంగంలో ప్రవేశించాడు. మొదట్లో ఎన్నో కస్టాలు పడ్డాడు , గుణ పాఠాలు నేర్చుకున్నాడు . అయినా పట్టువదలి విక్రమార్కుడులా సినిమా రంగంలో విజేతగా నిలబడ్డాడు .

1996 ఆయన నటించిన “హలో గురు” చివరి సినిమా . ఆ తరువాత నట జీవితానికి దూరంగా వున్నాడు. శోభన్ బాబు మృదు స్వభావి , సంస్కారం వున్న హీరో , ఎవరినీ పరుషంగా మాట్లాడేవాడు కాదు. తను , తన సినిమాలు , తన కుటుంబం , తన ఆర్ధిక లావాదేవీలు తప్ప వేరొకటి పట్టించుకునేవారు కాదు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ తన గ్లామర్ కాపాడుకొనేవాడు . ఆ గ్లామర్ ను చివరి వరకు ప్రేక్షకుల మనస్సులో పదిలంగా నిలుపుకొని వుండాలని అనుకున్నాడు వయసు వల్ల బట్ట తల వచ్చింది . ఆ బట్టతలతో తన అభిమానులకు కనిపించకూడదని నిర్ణయించుకున్నాడు .

అందుకే సినిమా రంగంలో జరిగే పెళ్లిళ్లు ,పేరంటాలు , సినిమా శత దినోత్సవాలు , సన్మానాలు , సత్కారాలు వేటికి పిలిచినా వెళ్లకుండా ఇంట్లోనే వుండిపోయాడు . కారణం తన అందాల రూపం ప్రేక్క్షకుల్లో మనస్సులో అలాగే ఉండిపోయాలని అనుకున్నాడు . బందు మిత్రుల నుంచి వత్తి వచ్చినా , స్నేహితులు చెప్పినా శోభన్ బాబు వినలేదు , ముసలి రూపం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు .

అలా జీవితం గడుపుతున్న శోభన్ బాబు 20 మార్చి 2008న తన 71వ సంవత్సరంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు .
శోభన్ బాబు 230 సినిమాల్లో నటించాడు . 5 నది అవార్డులు వచ్చాయి , 4 ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి .
శోభన్ బాబు మృతి ఎన్నటికీ చెరిగిపోని ఓ స్మృతి .
-భగీరథ