వరుణ్ తేజ్ ని చూసి వరస మార్చుకున్న సిద్దార్ద !వర్కవుట్ అవుద్దా?

మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో …విలన్ గా కనిపించనున్న సంగతి  తెలిసిందే. సిద్దార్ద హీరోగా తమిళంలో వచ్చిన హిట్టైన జిగర్తాండ చిత్రం రీమేక్ లో ఆయన్ని విలన్ గా చూపటానికి రంగం సిద్దం చేసారు దర్శకుడు హరీష్ శంకర్. ఇది ప్రేరణ ఇచ్చిందో ఏమో ..ఇప్పుడు హీరో సిద్దార్ద సైతం ఓ సినిమాలో విలన్ గా చేయటానికి రెడీ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

‘బొమ్మరిల్లు’,‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ద్వారా సిద్ధార్థ్ బాగా చేరువయ్యాడు. ఆ తరువాత ఆ స్థాయి విజయాలను అందుకోలేక వెనకబడిపోయాడు. ప్రస్తుతం ఆయన తమిళంలోనే చేస్తూ వస్తున్నాడు. అలాంటి సిద్ధార్థ్ త్వరలో తెలుగు తెరపై విలన్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది.‘ఇష్క్, మనం, 24..’వంటి విభిన్న తరహా చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.

నాని హీరోగా ఈ సినిమాను రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ థ్రిల్లర్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో యంగ్ విలన్ అవసరం కావడంతో, విక్రమ్ కుమార్ .. సిద్ధార్థ్ ను సంప్రదించడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మాణం జరగనుంది.

లవర్‌బాయ్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధార్థ్‌ విలన్‌గా ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ కథాంశం ఉండబోతోందట. ఇప్పటికే ఈ సినిమాలో సిద్దార్ద లుక్‌ టెస్ట్‌ కూడా చేశారట.